రాష్ట్రీయం

అలరించిన భారతీయ నర్తనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 19: కళల రాజధాని చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ మువ్వగోపాల కల్చరల్ ఆర్ట్ అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో ఆదివారం జాతీయ స్థాయి శాస్ర్తియ నృత్య ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు దేశ వ్యాప్తంగా వచ్చిన 600 మంది శాస్ర్తియ నృత్య విద్యార్థులు, కళాకారుల ప్రదర్శనలు వైభవంగా సాగాయి. మొత్తం 14 గంటల పాటు ప్రదర్శనలు నిర్వహించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదు చేసేందుకు భారతీయ నర్తనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ తమ పిల్లలు సంప్రదాయబద్ధమైన ఈ నృత్య కళలో రాణించాలని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించాల్సి ఉందన్నారు. పిల్లల్లో ఆసక్తిని తెలుసుకుని తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహాన్ని అందించాల్సి ఉందన్నారు. సంస్కృతీ, సాంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఈ సందర్భంగా శాస్ర్తియ నృత్యంలో గిన్నీస్ బుక్ రికార్డుకెక్కిన కర్నాటకకు చెందిన డాక్టర్ స్వాతి పి భరద్వాజ్ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. రాష్టప్రతి అవార్డు సాధించిన డాక్టర్ స్వాతిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘనంగా సత్కరించారు. పలు రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నాట్యాచార్యులు తమ శిష్య బృందాలతో వచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చారు.
తన నాలుగో ఏట నుంచి నృత్యంపై మక్కువతో ఎన్నో అవార్డులు సాధించిన కర్నాటకలో బిఎస్సీ సెకండియర్ చదువుతోన్న డాక్టర్ పి స్వాతి భరద్వాజ్ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. పిన్న వయసులోనే రాష్టప్రతి అవార్డును పొందడంతోపాటు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో కెక్కింది. ఇపుడు ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతిక శాఖ, శ్రీ మువ్వగోపాల కల్చరల్ ఆర్టు అకాడమి ఆధ్వర్యంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు వేదికపై ఆదివారం తన ప్రదర్శన నిర్వహించి పలువురి గురువుల ప్రసంశలు అందుకుంది. రాజమహేంద్రవరంలో డాక్టర్ స్వాతి 1160వ సోలో ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటి వరకు 148 జాతీయ అవార్డులు, 80 అంతర్జాతీయ అవార్డులు సాధించిన స్వాతి ప్రదర్శన ప్రేక్షకులతో అద్భుతహ అన్పించింది. డాక్టర్ వసుందర గురుస్వామి వద్ద నృత్యం అభ్యసించిన స్వాతి ఇంగ్లాండ్, సింగపూర్, మలేషియా, అండమాన్ నికోబార్ తదితర దేశాల్లో విశేష ప్రదర్శనలు ఇచ్చినట్టు తల్లిదండ్రులు అనిత, ఎంకె ప్రకాష్ చెప్పారు.