రాష్ట్రీయం

ఇక.. పరిగెత్తడమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: మహానగరంలో మెట్రోరైలు పరుగుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. మూడు కారిడార్లలో జోరుగా సాగుతున్న మెట్రో పనుల్లో భాగంగా ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు, మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు మెట్రోరైలు సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే సేఫ్టీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. ఈ నెల 28న ఈ రెండు కారిడార్లలో మెట్రోరైలు ప్రారంభించాలనుకుంటున్న సర్కారు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రారంభోత్సవ ఖరారు మినహా మిగిలిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇదివరకే అందుబాటులోకి వచ్చిన కారిడార్ 3లోని నాగోల్ నుంచి మెట్టగూడ వరకు మెట్రోరైలు పరుగులు పెట్టేందుకే ఇదివరకే అనుమతులొచ్చాయి. అయితే తాజాగా ఈ కారిడార్‌ను అమీర్‌పేట వరకు పొడిగించారు. అలాగే కారిడార్ 1లో కూడా మియాపూర్ నుంచి సంజీవరెడ్డినగర్ వరకు మెట్రోరైలు సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు గతంలోనే క్లియరెన్స్ వచ్చినా, దీన్ని కూడా అధికారులు ఇపుడు అమీర్‌పేట వరకు పొడిగించారు. దీంతో ఈ రెండు కారిడార్లలోనూ మెట్టుగూడ నుంచి అమీర్‌పేట వరకు, అలాగే సంజీవరెడ్డినగర్ నుంచి అమీర్‌పేట వరకు రైల్వే సేఫ్టీ అధికారుల క్లియరెన్స్ కోసం చేసిన నిరీక్షణకు తెర పడింది. ఇపుడు ఆ అనుమతులు కూడా రావటంతో మెట్రోరైలు మరో అడుగు ముందుకు పడిందని చెప్పవచ్చు. ఈ రెండు కారిడార్లలో పొడిగించిన కారిడార్లలో ఈ నెల 17నుంచి 19వ తేదీ వరకు మూడురోజుల పాటు సివిల్ పనులు, రోలింగ్ స్టాక్, ఆర్వోబి, వయోడక్ట్, సిగ్నల్ అండ్ ట్రెయిన్ కంట్రోల్, విద్యుత్ లైన్లు, కమ్యూనికేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన
తర్వాతే ఈ క్లియరెన్స్‌లు ఇచ్చినట్లు సిఎంఆర్‌ఎస్ రామ్‌కృపాల్ తెలిపారు.
తగ్గనున్న ట్రా‘్ఫకర్’
అమీర్‌పేట, సంజీవరెడ్డినగర్, బేగంపేట, మెట్టుగూడ, ఉప్పల్ అంటేనే ఆఫీసు వేళల్లో ఈ రూట్లలో వెళ్లేందుకు వాహనదారులు భయపడుతారు. ఇలా నిత్యం లక్షలాది వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే ఈ ప్రాంతాల్లో మెట్రోరైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ నుంచి చాలా ఉపశమనం కలిగే అవకాశముంది. ముఖ్యంగా నాగోల్, ఉప్పల్, మెట్టుగూడ, హబ్సిగూడ, బేగంపేట, అమీర్‌పేట తదితర ప్రాంతాల నుంచి సికిందరాబాద్ స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు చాలా తక్కువ సమయంలో నామమాత్రపు ఛార్జీలకు స్టేషన్ వరకు ప్రయాణించేందుకు మరో ఆత్యాధునిక ప్రజారవాణా వ్యవస్థగా మెట్రోరైలు అందుబాటులోకి రానుంది. అంతేగాక, పైన పేర్కొన్న ప్రాంతాలతో పాటు మియాపూర్, కూకట్‌పల్లి, జెఎన్‌టియు, మూసాపేట, భరత్‌నగర్, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల నుంచి సికిందరాబాద్, అమీర్‌పేట, బేగంపేట, నాగోల్, ఉప్పల్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులు సైతం ఎలాంటి ఆటంకాల్లేని, అడ్డంకుల్లేకుండా మెట్రోరైలులో ప్రయాణించనున్నారు.