రాష్ట్రీయం

బాబు ఓ దళారీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, నవంబర్ 21: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనంతా అబద్ధాలు, మోసాలు, దారుణాలేనని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తికి మీరంతా మళ్లీ ఓటేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజా సంకల్పయాత్ర 14వ రోజు మంగళవారం కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలో సాగింది. మధ్యాహ్నం బేతంచెర్లలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ రైతురుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ అని హామీ ఇచ్చి నేడు మాట మార్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికి కిలో బంగారం, మారుతికారు ఇస్తానని మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రమాదం ఉందన్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. అధికారం నిలబెట్టుకునేందుకు ఎన్నో హామీలు ఇచ్చిన బాబు, ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా దళారులకు వంత పాడుతున్న పెద్ద దళారి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తన దళారి సంస్థ హెరిటేజ్ కోసం రైతుల నుంచి తక్కువ ధరకు సరుకులు కొని
వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్నారు. మరో ఏడాది ఆగితే అందరి సహకారంతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. నాడు 108 కుయ్యి కుయ్యి అంటూ బాధితుల చెంతకు 20 నిమిషాల్లో చేరుకుంటే నేడు కావుకావు మని గీపెట్టినా వచ్చే పరిస్థితులు లేవన్నారు. కరెంటు చార్జీలు రూపాయి కూడా పెంచమని చెప్పిన బాబు ఎడాపెడా పెంచేశారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, నాలుగేళ్లయినా ఎవరికీ ఒక్క జాబు కూడా రాలేదన్నారు. జాబు ఇవ్వకపోతే నెలనెలా రూ.2 వేలు ఇస్తానని చెప్పారని, బాబు అధికారంలోకి వచ్చి 45 నెలలైందని, ఆ లెక్కన ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీపడ్డారన్నారు. రైతురుణమాఫీ, బ్యాంకుల్లోని బంగారం రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారని, నాలుగేళ్ల తరువాత రైతులను ప్రశ్నిస్తున్నా రుణమాఫీ డబ్బు బ్యాంకు వడ్డీకైనా సరిపోయిందా? అని అన్నారు. బ్యాంకుల్లో కుదవబెట్టిన బంగారం మీ ఇంటికి వచ్చిందా? అని అన్నారు. ఆయన వెంట పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
హోదాతోనే ఏపీకి న్యాయం
ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయం జరుగుతుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. హోదాతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మంగళవారం జగన్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ప్రకటించిందన్నారు. హోదా వస్తుందని చెప్పిన చంద్రబాబు ప్రజలను మోసగించారన్నారు. హోదా గురించి టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సంకల్పయాత్రకు మంచి స్పందన లభిస్తోందని, ప్రజలు తమ సమస్యలు తన వద్ద ఏకరువు పెడుతున్నారన్నారు. ప్రజల సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. పార్టీ ఫిరాయింపులను టీడీపీ ప్రోత్సాహిస్తోందని జగన్ ఆరోపించారు. సంతలో గొర్రెలను కొనుకోలు చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలను బాబు కొంటున్నారన్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదన్నారు. అసెంబ్లీ సీట్లు పెరగవని అందరికీ తెలుసునని, అయితే పార్టీ మారిన వారికి ఏం చెప్పాలో తెలియక సీట్లు పెరుగుతాయని బాబు కథలు చెబుతున్నారని అన్నారు.
చిత్రం..బేతంచెర్లలో జరిగిన సభలో ప్రసంగిస్తున్న జగన్