రాష్ట్రీయం

సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై పద్మావతీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 21: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగళవారం ఉదయం అమ్మవారు గోవర్థనగిరిధారుడైన శ్రీకృష్ణుని రూపంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై అమ్మవారు మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులను అనుగ్రహించారు. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. వాహన సేవ అనంతరం అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. కాగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం 7 గంటలకు అమ్మవారి రథోత్సవం వైభవంగా జరగనుంది.