రాష్ట్రీయం

రెండేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 23: రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో 3 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఏపీ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మేథా టవర్స్ ప్రాంగణంలో 150కోట్ల రూపాయలతో నిర్మించే న్యూ ఐటీ టవర్‌కు గురువారం భూమిపూజ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీ రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమేజ్ బ్రాండ్‌నేమ్‌గా ఉపయోగపడుతోందన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఐటీ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే 30వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని చెప్పారు. విశాఖలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, అగ్రిటెక్ సదస్సును ఇటీవలే నిర్వహించి వ్యవసాయ రంగంలో సాంకేతిక అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఐటీ రంగానికి సంబంధించి కూడా ఈ కార్పొరేషన్ ద్వారా అవసరమైన స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నామన్నారు. కేసరిపల్లి వద్ద 5 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో న్యూ ఐటీ టవర్ నిర్మాణం 8 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. దీనిద్వారా 4వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని మంత్రి లోకేష్ వివరించారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె విజయానంద్, ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ చైర్మన్ డా. రవికుమార్, నూజివీడు రెవిన్యూ డివిజనల్ అధికారి చెరుకూరి రంగయ్య, తహశీల్దార్ ఎం మాధురి, ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..కొత్త ఐటీ టవర్ నిర్మాణానికి భూమిపూజ చేసి సభలో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేశ్