రాష్ట్రీయం

హామీలు నెరవేర్చకపోతే రీకాల్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దుర్తి, నవంబర్ 23: హామీలు అమలుచేయని నాయకులను నిలదీసి రీకాల్ చేయాలని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని వారిని రీకాల్ చేసే రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందని అన్నారు. ప్రజా సంకల్పయాత్ర 16వ రోజు గురువారం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా వెల్దుర్తిలో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ అధికార పీఠాన్ని హస్తగతం చేసుకోవడానికి నాయకులు ఎన్నికల ముందు ఇబ్బడిముబ్బడిగా అమలుకు నోచుకోని వాగ్దానాలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం ప్రజలను మోసగించి గద్దె నెక్కుతున్నారని, ఆ తర్వాత హామీలను తుంగలో తొక్కుతున్నారన్నారు. హామీలు నెరవేర్చని నాయకులను నిలదీసి పదవీచ్యుతున్ని చేసే రాజకీయ వ్యవస్థ రావాలన్నారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయిందన్నారు. దీన్ని మార్చి విశ్వసనీయత పెంచేందుకు ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాలని అన్నారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు దోచుకుంటున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు నాయుడు పాలనకు చరమగీతం పాడాలన్నారు. గత ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేసిన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయడంతో విఫలమయ్యారని ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన వచ్చిందంటే ప్రజలకు కష్టాలు తప్పడం లేదన్నారు. బాబును కుర్చీదింపితే ప్రజలు సుఖ శాంతులతో ఉంటారన్నారు. దివంగత నేత వైఎస్ హయాంలో ప్రజలు, రైతులు ఆనందంగా జీవించారన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే మహిళల అప్పులు పెరిగాయి, పేదలు, రైతుల భూములు లాక్కోవడం మొదలెట్టారని ఆరోపించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు సీఎంకు తమ బాధలు చెప్పుకోవడానికి అసెంబ్లీ వద్దకు వస్తే అరెస్టు చేయించడం అన్యాయమన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం రైతులను జైళ్లకు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులు ఆగడాలు, అరాచకాలను ప్రశ్నిస్తే హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. టిడిపి అక్రమాలను బయటపెట్టారనే వైకాపా నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేయించారని మండిపడ్డారు. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, మీకు అండగా నేనుంటానని హామీ ఇచ్చారు.
16వ రోజు సంకల్పయాత్ర
ప్రజా సంకల్పయాత్ర 16వ రోజు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో గురువారం కొనసాగింది. ఉదయం నరసాపురం క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైన పాదయాత్ర బ్రహ్మగుండం, బోయినపల్లె బస్టాప్ మీదుగా వెల్దుర్తికి చేరుకుంది. మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోష్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాక మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు వైకాపాలో చేరారు. గురువారం 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది.

చిత్రం..వెల్దుర్తి సభలో ప్రసంగిస్తున్న జగన్