రాష్ట్రీయం

మెట్రోతో మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, నవంబర్ 23: మెట్రో రాకతో నగరంలో ప్రజా రవాణ వ్యవస్థ మెరుగుపడనుంది. సిటీ బస్సుల కోసం నిరీక్షణ, ట్రాఫిక్ కష్టాలు లేకుండా గమ్యస్థానాలకు చేరుకునే వెసులుబాటు మెట్రోతో లభించనుంది. నగరంలో నానాటికీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన దుస్థితి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సులు, ఎంఎంటిఎస్ రైళ్లు ప్రజల అవసరాలను అంతంత మాత్రమే తీర్చతున్నాయి. రద్దీ సమయాల్లో ఒక్క బస్సులో రెండు బస్సులకు సరిపడా మంది ప్రయాణించాల్సిన దుస్థితి కొనసాగుతోంది. ఎంఎంఎటిఎస్ రైళ్లు పరిస్థితి అంతే.
నిత్యం జీవనోపాధి కోసం నగరానికి వచ్చే వారితో పాటు వివిధ పనుల నిమిత్తం రాజధానికి వచ్చే వారికి ముఖ్య రవాణా వ్యవస్థ ఆర్టీసీనే కావడంతో వాటిపై తీవ్ర భారం ఉండేది. పాత బస్సులతో ఇబ్బందులు రెట్టింపు అయ్యేవి. నిత్యం నగరంలో ఎక్కడో ఒక చోట బస్సులు నిలిచిపోవడంతో ఆయా బస్సుల్లో ప్రయాణించే వారితో పాటు ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడేది. ట్రాఫిక్ కష్టాలకు జంకి ఇంటి నుంచి గంట ముందు బయలుదేరినా కొన్ని సందర్భాల్లో గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకోవాల్సి వచ్చేది. నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ చెబుతున్నా ఆ మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చేంది. ప్రజా రవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నగరంలో వ్యక్తిగత వాహనాల సంఖ్య గత పదేళ్లల్లో విపరీతంగా పెరిగాయి. వీటివల్ల మరిన్ని ట్రాఫిక్ కష్టాలతో పాటు కాలుష్యానికి కారణం కాసాగాయి. వీటన్నింటికీ ప్రత్యామ్నాయంగా మెట్రో ప్రయాణం సాగనుంది. కాగా, అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వస్తున్న మెట్రోరైలు సైతం పూర్తిస్థాయిలో ప్రయాణికులకు ఊరట నివ్వలేదని, మెట్రో వ్యవస్థను అవసరాలకు అనుగుణంగా పెంచుకుంటూ పోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న మెట్రోరూట్ల వల్ల సుమారు 15 లక్షల మందికి ప్రయోజనం చేకూరినా అంతేమంది ప్రజలు ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెరుగుతున్న జనాభాకు దృష్టిలో ఉంచుకొని రోడ్ల విస్తీర్ణంతో పాటు ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి రోడ్లపై ఒత్తిడి తగ్గించాలని సూచిస్తున్నారు.
వీటితో పాటు వచ్చే పదేళ్లలో నగరంలో ప్రయాణికుల రద్దీ రెండింతలు పెరిగే అవకాశం ఉన్నందున మెట్రోమార్గాలను సైతం అందుకు అనుగుణంగా పెంచుతూ పోవాలని సూచిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలోని లోపాల వల్లే నగరంలో వ్యక్తిగత వాహనాలు పెరుగుతున్నాయని, వీటిని దృష్టిలో ఉం చుకొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంటున్నారు.