రాష్ట్రీయం

మెట్రో రైలు చార్జీలు రెండు రోజుల్లో ఖరారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: మెట్రోరైలు చార్జీలను ఒకటి రెండు రోజులలో రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. మెట్రోరైలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టితో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలోనే చార్జీలు కూడా ముందుగానే ఖరారు అయ్యాయి. అయితే గతంలో ఖరారు చేసిన చార్జీలను యధాతథంగా అమలు చేయాలా? లేక తాజాగా ఎల్ అండ్ టి సంస్థ చార్జీలను స్వల్పంగా పెంచాలని చేసిన ప్రతిపాదన మేరకు ఖరారు చేయాలా? అనేది ఒకటి రెండు రోజులలో తేలనుంది.
దీనికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలనలో ఉంది. ఈ నెల 29న మెట్రోరైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుండటంతో ఆ లోగానే ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని 2010లో గ్లోబల్ టెండర్ ద్వారా ఎల్ అండ్ టి సంస్థ దక్కించుకుంది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మెట్రోరైలులో కనీష్ట చార్జీ రూ.8, గరిష్ట చార్జీ రూ.19గా ఖరారు అయింది. అయితే ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉండగా అనేక కారణాల రెండు సంవత్సరాలు ఆలస్యంగా మొదటి దశ పూర్తి అయింది.
దీని వల్ల పెరిగిన ప్రాజెక్టు నిర్మాణ వ్యయం వల్ల కనిష్ట, గరిష్ట చార్జీలను సవరించాలని ఎల్ అండ్ టి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. కనిష్ట చార్జీ రూ. 10, గరిష్ట చార్జీ రూ.26గా ఎల్ అండ్ టి సంస్థ ప్రతిపాదించింది. దీనిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.