రాష్ట్రీయం

పత్తికొండ నుంచి శ్రీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిష్ణగిరి/ కోడుమూరు, నవంబర్ 25: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే తొలి అభ్యర్థి పేరును పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి శనివారం ప్రకటించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి పోటీ చేస్తారన్నారు. ప్రజా సంకల్పయాత్ర 17వ రోజు శనివారం క్రిష్ణగిరిలో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ గతంలో చెరుకులపాడు కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు శ్రీదేవికి టికెట్ ఖరారు చేశామన్నారు. శ్రీదేవి భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నానని, ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. దీంతో నారాయణరెడ్డి అమర్ రహే అంటూ ఆయన అనుచరులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. చెరుకులపాడు నారాయణరెడ్డి గత ఎన్నికల్లో పత్తికొండ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. అనంతరం ఆయన వైసీపీలో చేరారు. అప్పట్లో పత్తికొండ వైసీపీ టికెట్ ఇస్తామని జగన్ నారాయణరెడ్డికి హామీ ఇచ్చారు. గత మే 21వ తేదీ ఓ పెళ్లికి వెళ్లివస్తున్న నారాయణరెడ్డిని క్రిష్ణగిరి సమీపంలో ప్రత్యర్థులు కాపుకాసి కత్తులతో నరికి చంపారు. ఇక అప్పటి నుంచి ఆయన భార్య శ్రీదేవి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు ఓదార్పుయాత్రలో భాగంగా రాష్ట్రంలో వైసీపీ మొదటి అభ్యర్థిగా డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేరును జగన్ ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా 2019 ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే తొలి అభ్యర్థిగా పత్తికొండ నుంచి శ్రీదేవి పేరు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

చిత్రం..కర్నూలు జిల్లా క్రిష్ణగిరిలో జరిగిన సభలో పత్తికొండ వైసీపీ అభ్యర్థి శ్రీదేవి పేరు ప్రకటిస్తున్న జగన్