రాష్ట్రీయం

కన్నవారిని నిర్లక్ష్యం చేస్తే.. ప్రభుత్వోద్యోగులపై వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట, నవంబర్ 25: కన్నవారిని ఆదరించని ప్రభుత్వ ఉద్యోగులపై వేటు తప్పదని కడప జిల్లా కలెక్టర్ బాబూరావునాయుడు హెచ్చరించారు. తల్లిదండ్రులు, భార్యాపిల్లలను పోషించని, వారి బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తామని అన్నారు. తండ్రి బాగోగులు పట్టించుకోని శంకవరం పాఠశాల హెడ్‌మాస్టర్ జాషువాను సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. గత సోమవారం కడప నగరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో కలసపాడు మండలం, శంకవరం ఎంపిపి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు వి.జాషువాపై ఆయన తండ్రి సైమన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కుమారుడు తన బాగోగులు చూడడం లేదని, అతని నుంచి తనకు ప్రాణహాని ఉందని సైమన్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ విచారణ జరిపి హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిర్యాదును పరిశీలించిన జిల్లా విద్యాశాఖాధికారి జాఘువా తన తండ్రి బాగోగులు చూడడం లేదని నిర్ధారణ చేసుకుని కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. దీంతో ఈనెల 20న జాషువాపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, భార్యాపిల్లల నుంచి సక్రమంగా చూడం లేదని ఫిర్యాదులు అందితే విచారణ జరిపి సదరు ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పట్ల గౌరవభావం కలిగి ఉండాలని, వారి బాగోగులను చూడాలని, వారి పట్ల బాధ్యతగా మెలగాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉద్యోగం కోల్పోవడం ఖాయమని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ నిర్ణయాన్ని పలువురు హర్షిస్తున్నారు.