రాష్ట్రీయం

ముందే ఇవాంకతో మోదీ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా శే్వతసౌధం సలహాదారు ఇవాంక ట్రంప్‌తో 28వ తేదీ సాయంత్రం సమావేశం కానున్నారు. ఇవాంక ట్రంప్‌తో సమావేశం ముగిసిన వెంటనే జీఈఎస్ ప్రదర్ళనను, స్టార్టప్‌ల స్టాల్స్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాతనే శిఖరాగ్ర సదస్సు ప్లీనరీని ప్రధాని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేటకు చేరుకునే ప్రధాని మెట్రో రైలు కార్యక్రమాల్లో పాల్గొని 2.55కు హెలికాప్టర్‌లో హెచ్‌ఐసిసికి చేరుకుంటారు. వెంటనే ఇవాంక ట్రంప్‌తో భేటీ జరుగుతుంది. ఈ సందర్భంగా ఇవాంక అమెరికా నుండి వచ్చిన ప్రతినిధి బృందంలోని అధికారులను, వ్యాపారవేత్తలను పరిచయం చేయనున్నారు. అనంతరం ఆమెతో పలు అంశాలపై ప్రధాని భేటీ అవుతారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇది 20 నిమిషాలకే పరిమితం అయినా, దానిని మరికొంత సేపు పొడిగించే వీలుందని తెలిసింది. అనంతరం ప్రధాని, ఇవాంక ఇరువురూ హెచ్‌ఐసిసి ప్లీనరీ జరిగే హాల్-1కు చేరుకుంటారు. అక్కడ రెండు గంటల పాటు ప్లీనరీ జరుగుతుంది. అనంతరం ప్రధాని , ఇవాంకలు రోడ్డు మార్గంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రధాని దాదాపు రెండున్నర గంటల పాటు సమయం వెచ్చిస్తారు. ఈ సందర్భంగా పలువురు భారతీయ పారిశ్రామిక వేత్తలను కూడా ఆయన కలుస్తారు. విందు అనంతరం ఫలక్‌నుమా ప్యాలెస్ నుండి శంషాబాద్ చేరుకుని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు.
నూతన తరానికి చెందిన ఫ్లిప్‌కార్టు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సచిన్ బన్సాల్ మొదలు మొబిక్విక్ సహవ్యవస్థాపకుడు ఉపాసన టుకు కూడా జీఈఎస్ సదస్సులో మెరవనున్నారు. 29న జరిగే ప్రత్యేక సమాంతర సదస్సుల్లో మొదట జరిగే జిఐఎస్‌టి సమావేశంలో ఇవాంక ట్రంప్ సైతం పాల్గొంటారు. ఈ సమావేశంలో బన్సాల్ , ఉపాసన కూడా హాజరవుతున్నారు. ప్రైవేటు ఈక్విటీ, భవిష్యత్ సినిమా, ఆరోగ్య రంగంలో పెట్టుబడులు, మెంటారింగ్, నెట్‌వర్కింగ్, క్రీడాపారిశ్రామికత వంటి అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. సంప్రదాయ ఆర్ధిక వనరుల సేకరణ నుండి ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించడం, ఎదుగుతున్న మార్కెట్లలో పెట్టుబడుల అవకాశాలు, ఇ కామర్స్‌తో అనుసంథానం, మహిళల యాజమాన్యంలో వ్యాపారం, నగదురహిత సమాజం- పరిస్థితులు, కృత్రిమ మేథస్సు భవిష్యత్‌లో సంచలన మార్పులు, రానున్న శకంలో అంతరిక్షం ఒక మార్కెట్‌గా మారే తీరు అంశాలపై కూడా విస్తృత చర్చలు జరగనున్నాయి. బోయింగ్ అధ్యక్షుడు స్టీనెన్ నార్డులండ్, గోల్డ్‌మన్ సాచ్, బోయింగ్ ఎండి అంకుర్ సాహు, డెల్ ఏషియా పసిఫిక్ అధ్యక్షుడు అమిత్ మిదా, పేపాల్ వైస్ ప్రెసిడెంట్ లిసా మాథుర్, సెరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి నటాషా పూనావాలా, కిర్లోస్కర్ సిస్టిం చైర్మన్ గీతాంజలి కిర్లోస్కర్, కెఆర్‌బిఎల్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రియాంక మిట్టల్, ప్రాక్టో ఫౌండర్ శశాంక్ దత్తాత్రేయ, ఒఎల్‌ఎ కో ఫౌండర్ భవిష్ అగర్వాల్ , ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర, ఢిల్లీ హైకోర్టు జడ్జి ప్రతిభా సింగ్, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, నటి అదితి రావు, పూనం కపూర్, టెన్నీస్ తార సానియా మీర్జా, మిస్‌వరల్డ్ మానుషి చిల్లర్ తదితరులు హాజరుకానున్నారు.
నిఘా నీడలో హైటెక్స్
కీలక సదస్సు జరిగే హైటెక్స్‌లోనూ, విందు జరిగే ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ ఫోర్టులోనూ పోలీసులు వారం రోజులుగా జల్లెడ పడుతున్నారు. ఇవాంక కోసం మూడు వాహనాలు, ప్రధాని నరేంద్రమోదీకి మూడు వాహనాలు సిద్ధమవుతున్నాయి. ఎస్పీజీ, ఐఎస్‌డబ్ల్యు, సిఎస్‌డబ్ల్యు, అమెరికన్ సీక్రెట్ సర్వీసెస్ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో సిసి కెమరాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. గతంలోనే ఈ ప్రాంతాల్లో సిసి కెమరాలు ఉన్నా, వాటిని నేడు మరోమారు పునరుద్ధరించారు.

చిత్రాలు..సానియా మీర్జా *మానుషి చిల్లర్