రాష్ట్రీయం

బీసీలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, నవంబర్ 26: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర 18 రోజు ఆదివారం కర్నూలు జిల్లా కోడుమూరు మండల పరిధిలోని గోరంట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభల్లో జగన్ సిఎం చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా వాల్మీకులు (బోయ కులస్థులు) ఉన్నారని, గత ఎన్నికల్లో చంద్రబాబు బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని ఇచ్చినా హామీ ఇంతవరకూ అమలు చేయలేదని దుయ్యబట్టారు. ప్రతి ఎన్నికల్లో బాబు వాల్మీకుల ఓట్ల కోసం శుష్క
వాగ్దానాలు చేయడం, తరవాత వారి సంక్షేమాన్ని విస్మరించడం షరా మామూలైందని ఎద్దేవా చేశారు. అందుకే తాను వాల్మీకుల సంక్షేమానికి పాటుపడటమే గాక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలను వాల్మీకులకు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు గత నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేదని దుమ్మెత్తిపోశారు. అసమర్థ బాబు పాలనలో బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందడుగు వేయలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలను పెంచి పోషిస్తోందని ఆగ్రహించారు. గ్రామీణ స్థాయిలో పేద పిల్లలకు ఉన్నత చదువులు భారంగా మారాయన్నారు. దేవుడి కరుణ, ప్రజల ఆశీస్సులుంటే వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రతి పేద కుటుంబంలోని వారికీ ఉన్నత చదువులు, గౌరవప్రదమైన ఉద్యోగాలు కల్పిస్తామని, ఉన్నత చదువుల్లో రాణించేందుకు తాను ఏటా పేద విద్యార్థులకు రూ. 20వేలు అందిస్తానని హామీ ఇచ్చారు. పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తానని, 45 ఏళ్లకే పింఛను సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో పశువులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు 102 వాహనం ఏర్పాటు చేస్తానన్నారు. చంద్రబాబు గత ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా నెరవేర్చలేదని, కేవలం ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాసంకల్ప యాత్రలో తాను అన్ని వర్గాల ప్రజలకు చేసిన హామీలన్నింటినీ అధికారం చేపట్టిన వెంటనే నెరవేరుస్తానని, అంతేగాక తాను చెప్పకుండా పనులు చేసి చూపిస్తానన్నారు. రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులు ఉన్నాయి కానీ వారికి అధికారం చెలాయించే స్వేచ్ఛ లేదన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తికి తన మాట వినని ఆర్టీవోను కూడా బదిలీ చేయించుకునే పరిస్థితి లేదని జగన్ ఎద్దేవా చేశారు.