రాష్ట్రీయం

అంతా నా ఇష్టం అంటే ఎలా..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 27: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరి ఉన్న తిరుమల శ్రీవారి సన్నిధిలో అంతా నా ఇష్టం అంటున్న శ్రీవారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై సీనియర్ అర్చకుల్లో ఒకరైన ఖాధ్రిపతి నరసింహాచార్యులు మండిపడుతున్నారు. ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితుల వ్యవహార శైలిపై ఇటు ఆలయ అర్చక సమాజం, అధికారులు ఆగ్రహంతో ఊగిపోతున్న విషయం పాఠకులకు విదితమే. ఈక్రమంలో శ్రీవారి ఆలయ మహాద్వారం గుండా రమణదీక్షితులు తన మనవడిని ఆలయంలోకి తీసుకువెళ్లడమే కాకుండా నివేదన సమయంలో తనతోపాటు ఉంచుకోవడంపై టీటీడీ యాజమాన్యం కూడా తీవ్రంగా స్పందించింది. ఇందులో భాగంగా ఆయనకు శ్రీముఖాన్ని జారీ చేసింది. అలాగే ఆలయంలో విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారన్న కారణంగా రమణ దీక్షితుల ఇద్దరు కుమారులను తిరుపతలోని గోవిందరాజస్వామివారి ఆలయానికి బదిలీ చేసింది. వాస్తవానికి మిరాశీ విధానం రద్దయిన తరువాత అర్చక వ్యవస్థ అంతా టీటీడీ యాజమాన్య పరిధిలోకి వచ్చింది. దీంతో వారు టీటీడీ ఉద్యోగులుగా గుర్తింపు పొందారు. సాధారణంగా టీటీడీ ఉద్యోగులను బదిలీ చేసే అధికారం యాజమాన్యానికే ఉంటుంది. అయితే ప్రధాన అర్చకులను బదిలీ చేయడంతో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇక తనకు నోటీసులు జారీ చేసే అధికారం టీటీడీ అధికారులకు లేదని రమణ దీక్షితులు వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తననుకలిసిన విలేఖరులతో సీనియర్ అర్చకులు ఖాధ్రిపతి నరసింహాచార్యులు సాటి అర్చకుల పట్ల రమణ దీక్షితులు అనుసరిస్తున్న తీరును తీవ్రంగా గర్హించారు. ప్రధానంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్‌లో తమను రమణ దీక్షితులు ఔట్‌సోర్సింగ్ అర్చకులుగా మాట్లాడటాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రమణ దీక్షితుల కుమారుల బదిలీ విషయంలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయంలో నిరంతరం పూజా కైంకర్యాలు నిర్వహించేది తామేనని అన్నారు. తమను కించపరిచేలా దీక్షితులు నిరంతరం వ్యాఖ్యలు చేస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారన్నారు. శ్రీవారి ఆలయంలో హోదా విషయంలో రమణ దీక్షితులు ఎంతో తామూ అంతేనన్నారు. అందరూ టీటీడీ సంస్థలో పనిచేస్తూ స్వామివారికి కైంకర్యాలు నిర్వహిస్తున్నవారమేనని అన్నారు. గతంలో ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా రమణ దీక్షితులు స్వామివారికి నివేదన చేసే సమయంలో తన మనవడిని మహాద్వారం గుండా ఆలయంలోకి తీసుకు వచ్చారని, నివేదన సమయంలో కూడా మనవడిని తనవెంటే ఉంచుకున్నారన్నారు. ఈ విషయాన్ని గుర్తించి విధుల్లో ఉన్న టీటీడీ అధికారులు ‘స్వామి మీ మనవడిని వెలుపలికి పంపండి అని రమణదీక్షితులను కోరారన్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం తనకు అధికారాలు ఉన్నాయని, అడగటానికి మీరెవరంటూ’ వారిపై దీక్షితులు అగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఆ సమయంలో స్వామివారి నివేదనలో తాను కూడా విధులు నిర్వహిస్తున్నానన్నారు. మీరెందుకు అభ్యంతరం చెప్పలేదన్న ప్రశ్నకు సమాధానంగా ఆలయ ప్రధానార్చకులుగా ఉన్న వ్యక్తే నిబంధనలు ఉల్లఘిస్తూ ఉంటే ఎవరికి చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న టీటీడీ ఈ ఓ తనను పిలిచి ఏం జరిగిందని ప్రశ్నించారన్నారు. జరిగిన విషయాన్ని తాను వివరించానని చెప్పారు. లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వమని ఈఓ కోరడంతో తాను లిఖిత పూర్వకంగా తెలియజేశానన్నారు. వాస్తవానికి 43 మంది కైంకర్యపరులు అర్చకులు ఉంటారని ప్రస్తుతం 32 మందే ఉన్నారన్నారు. అయినప్పటికీ పనిభారం పెరిగినా తామే స్వామివారికి కైంకర్యాలను ఎంతో భక్తితో నిర్వహిస్తున్నామన్నారు. 40సంవత్సరాలపాటు తాము ఆయనతోపాటు సరిసమానంగా స్వామివారికి సేవలు అందిస్తున్నామన్నారు. అలాంటప్పుడు తమనెలా కించపరుస్తారన్నారు. ఎన్నోసార్లు ఆయన వేధింపులను భరించామన్నారు. ఏరోజు కూడా ఆయన మాటను జవదాటలేదన్నారు. ఆయినప్పటికి ఆయనలో మార్పు రాలేదన్నారు. స్వామి సన్నిధిలో ‘అంతా నాఇష్టం’ అంటూ రమణదీక్షితులు వ్యవహరించడం సబబు కాదన్నారు.