రాష్ట్రీయం

నాందేడ్-పూర్ణ సెక్షన్‌లో ఒక రైలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: నాందేడ్- లింబ్‌గాన్-చుడ్వా-పూర్ణ సెక్షన్‌లో మెషిన్ ట్యాంపింగ్ పనుల కారణంగా లైన్ బ్లాక్ చేస్తున్నందున ఆ రూట్లో నడిచే ఒక ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 28, 29, డిసెబంర్ 1, 2, 3, 5,6 తేదీల్లో రైళ్ల రద్దు, పాక్షిక రద్దు ఉంటుందని పేర్కొంది. డిసెంబర్ 1న నడిచే నాందేడ్-ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్ నెం.17620 రైలు రద్దయింది. నవంబర్ 28, 29, డిసెంబర్ 1,2,3,5, 6 తేదీల్లో నాందేడ్-పూర్ణ మధ్య కాచిగూడ-మన్మాడ్ పాసింజర్ రైలును పాక్షికంగా రద్దు చేసింది. అలాగే మన్మాడ్-కాచిగూడ పాసింజర్‌ను నవంబర్ 28, 29, డిసెంబర్ 1,2,3,5,6న పూర్ణ-నాందేడ్ మధ్య పాక్షికంగా రద్దయ్యిందని వెల్లడించింది. నాగర్‌సోల్-నాందేడ్ పాసింజర్ రైలు నవంబర్ 28, 29, డిసెంబర్ 1,2,3,5,6 తేదీల్లో పూర్ణస్టేషన్ వరకే పరిమితం చేయబడింది.