రాష్ట్రీయం

నేడే జీఈఎస్ సదస్సు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రపంచ పారిశ్రామికత సదస్సు మంగళవారం నాడు హైటెక్స్‌లోని నోవాటెల్‌లో ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ఈ సదస్సును ప్రారంభిస్తారు. అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్, తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో పాటు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాల్గొంటున్నారు. ఇనె్వస్టర్లు, పారిశ్రామిక వేత్తలు, విజ్ఞానాధారిత ప్రదాన పరిశ్రమల ముఖ్య కార్యనిర్వాహణాధికారులు కూడా హాజరవుతున్నారు. ప్రపంచం నలుమూలల నుండి 160 దేశాల ప్రతినిధులు వస్తున్నారు. అందులో దాదాపు 10 దేశాల నుండి పూర్తిగా మహిళా బృందాలే రానున్నాయి. ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించడంలో భారత ప్రభుత్వం పక్షాన నీతి ఆయోగ్ ముఖ్య పాత్రను పోషిస్తోంది. ప్రపంచంలోని ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేయడానికి, వారితో సమన్వయాన్ని ఏర్పరచుకోవడానికి భారతీయ స్టార్ట్ అప్‌లకు , ఇన్నోవేటర్లకు ఇది ఒక విశిష్టమైన అవకాశం అవుతుంది. శిఖరాగ్ర సదస్సు నిర్వహణకు తొలుత తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడంతో హైదరాబాద్ వేదికగా మారింది.
ప మంగళవారం సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే ప్లీనరీలో మాట్లాడేది ముగ్గురే. ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడిన తర్వాత తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు మాట్లాడతారు. అనంతరం అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ మాట్లాడతారు. ముగ్గురి ప్రసంగాలు ముగిసిన వెంటనే ప్యానల్ చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ఎమిరిటస్ విమానాలు, సిస్కొ సంస్థ ప్రతినిధులు పాల్గొంటారు. ఇందులో ఇంవాంక ట్రంప్‌తో పాటు ఎస్‌ఆర్‌ఎస్ ఏవియేషన్ ఎండి సిబొంగైల్ శంబో, కేంద్ర రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, ఎస్‌ఇబి చైర్మన్ మార్కస్ వాలెన్‌బర్గ్ మాట్లాడతారు.
పరంగురంగుల చిత్రాలతో హైటెక్స్ ప్రపంచ సదస్సుకు ముస్తాబు అయ్యింది. రోడ్లు, డివైడర్లు , పచ్చని చెట్లకు కొత్త రంగులతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. పక్కనే ఉన్న మెట్రో వంతెనకు సైతం రంగులు వేయడంతో చూడచక్కగా కనువిందుగా ఇది హైదరాబాద్ నగరమా అన్నట్టు గోచరిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా లైటింగ్‌తో అలంకరించారు.
* నగరంలో 26 హోటళ్లలో విదేశీ అతిథులకు బస ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రానికి దాదాపు వెయ్యి మంది విదేశీ ప్రతినిధులు నగరానికి చేరుకున్నారు. మిగిలిన బృందం అమెరికా నుండి ప్రత్యేక విమానంలో రానుంది.
* తొలి రోజు సదస్సు ప్లీనరీ కార్యక్రమం కేవలం రెండున్నర గంటల పాటు జరుగుతుంది. ప్లీనరీ ఏడున్నర గంటలకు ముగుస్తుంది.
* ఇవాంక ట్రంప్ సదస్సుకు హాజరవుతున్న సందర్భంగా ఆమెకు హోటల్ వెస్టిన్‌లో బస ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే ఆమె వెస్టిన్‌లోనే ఉంటారా లేదా వేరే చోట ఆమె బసకు ఏర్పాట్లు చేశారా అన్నదానిపై అధికారులు వెల్లడించడం లేదు. ఇవాంక బస చేసేందుకు హోటల్ ట్రైడెంట్ కూడా పరిశీలించినట్టు తెలిసింది. మరో ప్రత్యామ్నాయం కింద హోటల్ ఇనోటెల్‌ను కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది.
* రెండు రోజుల పాటు గడిపిన అనంతరం ఇవాంక ట్రంప్ 29వ తేదీ రాత్రి తిరుగుప్రయాణం అవుతారు. 28వ తేదీ ఉదయమే ఆమె హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుండి ఆమె బస చేసే వెస్టిన్ హోటల్ (ఆఖరి నిమిషంలో మార్పు ఉంటే ట్రైడెంట్‌కు) చేరుకుంటారు. మధ్యాహ్నం వరకూ విశ్రాంతి తీసుకుని ఆమె 3 గంటలకు హెచ్‌ఐసిసికి చేరుతారు. అక్కడ ఏర్పాట్లపైనా, సహచర బృందంతో సంభాషిస్తారు. అనంతరం ప్లీనరీలో పాల్గొంటారు. ఏడు గంటల సమయంలో ఆమె హెచ్‌ఐసిసి నుండి హోటల్‌కు చేరుకుని అక్కడి నుండి 8 గంటలకు ఫలక్‌నుమా ప్యాలస్‌కు వెళ్తారు. రాత్రి 10.40 గంటల వరకూ అక్కడే గడుపుతారు. మరుసటి రోజు 29వ తేదీన ఉదయం జరిగే తొలి సదస్సులో ఆమె పాల్గొనేందుకు హెచ్‌ఐసిసికి వస్తారు. 11 గంటల నుండి సాయంత్రం 5 వరకూ ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం హోటల్‌కు చేరుకుని తిరుగు ప్రయాణం అవుతారు.
విందు రికార్డు
నరేంద్రమోదీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంత వరకూ ఎన్నడూ ఇవ్వని అధికారిక విందు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఫలక్‌నుమా ప్యాలస్‌లో ఆయన ఇచ్చే విందుకు ఇవాంక ట్రంప్‌తో పాటు ఇద్దరు కేంద్ర మంత్రులు, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు 150 మంది పారిశ్రామికవేత్తలు, పుర ప్రముఖులు హాజరు కాబోతున్నారు.