రాష్ట్రీయం

చేయలేని ఉద్యోగం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: ప్రపంచంలో మహిళలు చేయలేని ఉద్యోగం లేదు అని లాక్‌హీడ్ మార్టిన్ రోటరీ అండ్ మిషన్ సిస్టమ్స్ డిప్యుటీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లారిన్ ఎం మార్టిన్ వ్యాఖ్యానించారు. తమ సంస్థలో వివిధ ఉత్పత్తుల రూపకల్పనలో మహిళలు పాలుపంచుకున్నారని వారంతా పురుషులతో సమానంగా వారి పక్కనే పనిచేస్తున్నారని ఇది మహిళా శక్తికి ప్రతీక అని ఆమె వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రభూమితో మాట్లాడుతూ ఐటి రంగంలో మహిళలు ఎంతో సమర్ధంగా తమ శక్తి యుక్తులను ప్రదర్శిస్తున్నారని, అదే రీతిన ఉత్పత్తి రంగంలోనూ మహిళలను అనుమతించాలని అన్నారు. మహిళలు షిఫ్టుల్లో పనిచేయలేరని అంటారు, అది అవాస్తవం. పురుషులతో సమానంగా వారు పనిచేయగలరు అని వ్యాఖ్యానించారు. ఐటి రంగంలో మహిళల విషయంలో లేని ఆంక్షలు మిగిలిన రంగాల్లో ఎందుకు అని మార్టిన్ ప్రశ్నించారు. కార్మిక చట్టాలలో ఈ వివక్ష ఎందుకు చూపుతున్నారో అర్ధం కావడం లేదు అని ఆమె అన్నారు. లాక్‌హీడ్ సంస్థలో 97వేల మంది పనిచేస్తున్నారని అందులో 24 శాతం మంది మహిళలే అని అన్నారు. తమ సంస్థ మిలటరీ అవసరాలకు సి-130 ఎయిర్ క్రాఫ్ట్‌లను తయారుచేస్తోందని చెప్పారు. ఇందుకు అవసరమైన వౌలిక ఉపకరణాలు హైదరాబాద్‌లో తయారుచేస్తున్నట్టు ఆమె చెప్పారు.