రాష్ట్రీయం

మోదీకి ఘన స్వాగతం, వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: మెట్రోరైలు, గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించగా, అదేస్థాయిలో రాత్రి పది గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో వీడ్కోలు లభించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున బేగంపేట విమానాశ్రయాన్ని అందంగా అలంకరించగా, ప్రధానికి అట్టహాసంగా స్వాగతం లభించింది. మధ్యాహ్నం 1.15 నిమిషాలకు ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోగానే గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి కెటిఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ పుష్పగుచ్ఛాలను ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం అక్కడ ప్రధానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ, చేవెళ్ల ఎంపి కొండా విశే్వశ్వర్‌రెడ్డిని ముఖ్యమంత్రి పరిచయం చేయగా ప్రధాని వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. విమానాశ్రయంలో కొద్దిసేపు గవర్నర్, ముఖ్యమంత్రితో ప్రధాని భేటీ అయ్యారు. పర్యటన ముగించుకొని రాత్రి పది గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్ వీడ్కోలు పలికారు. తన పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో లభించిన అతిథ్యానికి ప్రధాని ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు.

చిత్రం..మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో శాలువా కప్పి స్వాగతం పలుకుతున్న సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్