రాష్ట్రీయం

మెట్రో.. నా ఘనతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 29: ‘హైదరాబాద్ అభివృద్ధిలో మా ముద్ర పోయేది కాదు. మెట్రోతోపాటు జీఈఎస్ జరుగుతున్న హెచ్‌ఐసిసి వేదిక, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, సైబరాబాద్ ఇవన్నీ టీడీపీ హయాంలో వచ్చినవే. మెట్రోరైల్‌ను నేను ప్రారంభించినా, ప్రారంభించకున్నా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్న సంతృప్తి ఉంది’ అని ఏపీ సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ లాబీలో బాబును కలిసిన మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌లో మెట్రో రైలు, జీఈఎస్ సదస్సు గురించి ప్రస్తావించారు. మెట్రో ప్రస్తావనపై బాబు ఉత్సాహాన్ని చూపించారు. మెట్రోరైల్ కోసం వాజపేయి హయాంలో తానే పోరాడానని గుర్తు చేశారు. ‘మెట్రో కోసం నేనే పోరాడా. బెంగళూరు, గుజరాత్ ప్రభుత్వాలు మెట్రోను వేగంగా పూర్తి చేశాయి. నేను సీఎంగా ఉన్నప్పుడే ఢిల్లీ మెట్రో శ్రీ్ధరన్‌తో హైదరాబాద్ మెట్రోపై స్డడీ చేయించా. నా తర్వాత వచ్చిన రాజశేఖరరెడ్డి మెట్రోను ఆలస్యం చేశారు. అందుకే ఇంతకాలం పట్టింది’ అని వ్యాఖ్యానించారు. ‘నేను ఆ ప్రారంభోత్సవానికి వెళ్లినా వెళ్లకున్నా హైదరాబాద్‌పై మేం వేసిన ముద్ర చెరిగేది కాదు. అప్పుడు సైబరాబాద్ నగర నిర్మాణం కూడా టీడీపీ హయాంలోనే జరిగింది. అప్పుడు ఏపీని ప్రపంచానికి ప్రమోట్ చేసేందుకు కష్టపడ్డా. ఆ ఫలితాలు ఇప్పుడు అందరూ అనుభవిస్తుండటం మంచిదే. నాకూ అంతకుమించి తృప్తి ఏం కావాలి’ అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై మాట్లాడుతూ ఈ విషయంలో గట్టిగా ఉంటామని, యాజమాన్యాలు తప్పుచేస్తే సహించేది లేదని మొన్న వాళ్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చామని గుర్తు చేశారు. ఈ విషయం చెప్పడానికే తాను సభలోకి మాట్లాడానని బాబు చెప్పారు. విద్యార్థులు అధైర్యానికి లోను కావద్దని సూచించారు.