రాష్ట్రీయం

ఎమ్మెల్యేలపై కేసులను ఎందుకు ఉపసంహరించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార పార్టీ టిడిపికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై ఉన్న క్రిమినల్ కేసులను ఉపసంహరించుకుంటూ జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్ కేసులో హైకోర్టు ధర్మాసనం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం, ఏపి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జి శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఈ పిల్‌నును విచారించింది.ఇదే కేసుపై వైకాపా ఎమ్మెల్యే కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండింటిని కలిసి రిజిస్ట్రీలో నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులపై ఆంధ్రప్రభుత్వం ఉపసంహరిస్తూ జారీ చేసిన 13 జీవోలను పిల్‌లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సవాలు చేసింది. ఈ కేసులను ఉపసంహరించుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. దర్యాప్తు ప్రాతిపదికన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఒక్కటే కేసులను ఉపసంహరించుకునే హక్కు ఉంటుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. కాగా హైకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నంత వరకు దిగువ కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు వాయిదాలు కోరుతారని, అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు.