రాష్ట్రీయం

నకిలీ ట్రాన్సిస్టర్ల సరఫరా కేసులో అనిల్ సింఘ్వీకి 15ఏళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ట్రాన్సిస్టర్ల సరఫరా వేర్వేరు కేసుల్లో హైదరాబాద్‌లోని మిసెస్ కెంప్ట్రానిక్స్ యజమాని అనిల్ సింఘ్వీకి 15ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ. 9 లక్షలు జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. నకిలీ డాక్యుమెంట్లతో రూ. 1.5 కోట్ల విలువ చేసే యుఎస్‌ఏ-రష్యా కంపెనీలకు చెందిన ట్రాన్సిస్టర్లను సరఫరా చేస్తామంటూ బీడీఎల్‌తో అనిల్ సింఘ్వీ ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ట్రాన్సిస్టర్లను సరఫరా చేశారు. ఈమేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టి నిందితుడికి ఆర్‌సీ 06(ఏ)/2013-హైదరాబాద్, సీసీ నెం.28/2014లో మూడేళ్లు జైలు, యు/ఎస్ 420 చీటింగ్ కేసులో లక్ష రూపాయల జరిమానా, మరో కేసు 471 కేసులో ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 3 లక్షల జరిమానా, యు/ఎస్ 468 కేసులో ఏడేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 5లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించని పక్షంలో తొమ్మిది నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మొత్తం మూడు వేర్వేరు కేసుల్లో మిసెస్ కెంప్ట్రానిక్స్ యజమాని అనిల్ సింఘ్వీకు 15ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 9 లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది.