రాష్ట్రీయం

చంద్రబాబువన్నీ పచ్చి అబద్ధాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: పోలవరం ప్రాజెక్టును 2019నాటికి పూర్తిచేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, దాదాపు రూ.1800 కోట్లు ఖర్చుపెట్టి తాత్కాలికమైన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు చేపట్టారని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టు నిర్మాణంపై 21 ప్రశ్నలకు వివరణ కోరుతూ ఆరు పేజీల లేఖను సంధించారు. కేవీపీ తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిన ప్రకటన వల్ల, ప్రాజెక్టు నిర్మాణం, నిధుల ఖర్చు విషయంలో ప్రజల్లో గందరగోళం, అయోమయం నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయాన్ని విభజన చట్టానికి వ్యతిరేకంగా 2014 అంచనాల ప్రకారం మాత్రమే భరిస్తామని కేంద్రం కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చిందని, దీనివల్ల రాష్ట్రానికి భారీనష్టం జరుగుతుందని అన్నారు. చంద్రబాబుకు అన్నీ తెలిసినా కేంద్రాన్ని నిలదీసే పరిస్థితిలో లేరని వెల్లడించారు. హైకోర్టులో ఈ ప్రాజెక్టుపై పిటిషన్ వేయడం వల్లనే, ఏపీ ప్రభుత్వం శాసనసభలో హఠాత్తుగా ప్రకటన చేసిందని చెప్పారు. ప్రాజెక్టు విషయంలో శాసనసభ సాక్షిగా
చంద్రబాబు చెబుతున్నవన్నీ అర్ధసత్యాలేనని కేవీపీ ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు’ అని నామకరణం చేసినా, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పేరును తొలిగించారని కేవీపీ మండిపడ్డారు. చంద్రబాబుకు రాజకీయ జన్మనిచ్చిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీని, పునర్జన్మ నిచ్చిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచారని, ఆ ఘనచరిత్ర ఆయనకే దక్కుతుందని తీవ్రంగా విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికే ప్రత్యేక హోదాను గాలికి వదిలేశారని ఆరోపించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి ఇచ్చే మొత్తం కేంద్ర సహాయం గ్రాంట్-ఇన్-ఎయిడ్‌గా ఇవ్వాలని యూపీఏ కేబినెట్ నిర్ణయిస్తే, బీజేపీ ప్రభుత్వం డైరెక్టుగా ఇవ్వకుండా అ నిధులను నాబార్డు ద్వారా ఇవ్వాలని నిర్ణయించిందని, ఇది నిజం కాదా? అని కేవీపీ ప్రశ్నించారు. నాబార్డ్ నిధులు విడుదల చేసేటప్పడు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆనేక ఆంక్షలు విధించిందని, అది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మూడేళ్లపాటు కాంట్రాక్టర్ల గురించి మాట్లాడని ముఖ్యమంత్రి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. పోలవరం కుడి, ఎడమ కాలువలు కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో తవ్వితే, రెండు మోటార్లు తెచ్చి పట్టిసీమ ఎత్తిపోతల అంటూ, నదుల అనుసంధానం పేరు చెప్పి తొమ్మిదిసార్లు ప్రారంభోత్సవాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని మండిపడ్డారు. పోలవరం నిధుల విషయంలో ప్రభుత్వం ఒక శే్వతపత్రం ఎందుకు విడదల చేయడం లేదని కేవీపీ ప్రశ్నించారు.