రాష్ట్రీయం

వడ్డీగిరీకి ముకుతాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: ప్రజా జీవితాలతో చెలగాటమాడుతున్న వడ్డీ వ్యాపారులను కట్టడి చేసేలా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో గురువారం ఆంధ్రప్రదేశ్ వడ్డీ వ్యాపారుల బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లును శాసనమండలిలో ఆమోదించిన తర్వాత తక్షణం రాష్టప్రతి ఆమోదం కోసం కేంద్రానికి పంపుతామని అసెంబ్లీలో హోంమంత్రి తరఫున బిల్లు ప్రవేశపెట్టిన రాష్ట్ర రవాణా మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా నిబంధనలు ఉల్లంఘించి ఏ వ్యక్తీ వడ్డీ వ్యాపారం నిర్వహించడానికి వీల్లేదన్నారు. అయితే దీనికి లైసెన్స్ అథార్టీగా రెవెన్యూ, పోలీస్ శాఖలలో ఏ శాఖను నిర్ణయించాలో తర్వాత నిర్ణయిస్తామన్నారు. లైసెన్స్‌దారు 5 వేల నుంచి రెండున్నర లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు మోసం చేస్తేనో, దురుద్దేశ్యంతో ఉన్నాడని గుర్తిస్తే లైసెన్స్ నిరాకరించవచ్చన్నారు. ప్రతి వడ్డీ వ్యాపారీ తన దుకాణంలో అతని/ఆమె పేరు ప్రముఖంగా పేర్కొనవలసి ఉంటుంది. ఇష్టానుసారం వడ్డీ వసూలు కుదరదు. ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ రేటునే వసూలు చేయాలి. లైసెన్సింగ్ అధికారి ఏక్షణం అయినా ఖాతా బుక్స్‌ను పరిశీలించవచ్చు. ఏడాదికోసారి విధిగా ఆడిట్ చేయించాలి. అధిక
వడ్డీ వసూలు చేస్తే ఒక ఏడాది నుంచి మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. మహిళలపై లైంగిక వేధింపుల విషయంలోనూ, లేదా వాటికి సంబంధించిన అపరాధాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక న్యాయస్థానం హోదా కలిగిన సంస్థను ఏర్పాటు చేస్తారు. సంతకాలతో ఖాళీ చెక్కులు, ఖాళీ ప్రాంసరీ నోట్లు చెల్లబోవన్నారు. బిల్లు ఆమోదానికి ముందు అరగంట సేపు తీవ్రస్థాయిలో చర్చ సాగింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ వెయ్యి రూపాయలకు రూ.800 ఇచ్చి వెయ్యి వసూలు చేస్తున్నారని, బకాయి తీర్చినా తమ వద్ద ఉన్న పత్రాలు తిరిగి ఇవ్వకపోవడం లేదా హామీదారుని పత్రాలను ఇవ్వకుండా కోర్టులలో కేసులు వేస్తున్నారన్నారు. కాల్ మనీ వ్యవహారంలో మహిళలను ఏవిధంగా వేధించారో చూశామన్నారు. జాతీయ బ్యాంకులు, ప్రైవేట్, సహకార బ్యాంకులు ఉన్నప్పటికీ సకాలంలో రుణం లభించనందునే ప్రజలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ వడ్డీ వ్యాపారులు కాదు వీరు రక్తాన్ని పీల్చే జలగలు, చిరువ్యాపారులను దోచుకుంటున్నారన్నారు. రోజుకు 10 నుంచి 12 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి హామీల్లేకుండా ముద్రా రుణాలు అందిస్తున్నారని, దీన్ని సీఎం చంద్రబాబు ప్రోత్సహించాలన్నారు. సభ్యుడు త్రిమూర్తులు మాట్లాడుతూ కొందరు వడ్డీ వ్యాపారులు జీపీ రాయించుకొని, తర్వాత అక్రమంగా తమ తాకట్టులోని ఆస్తులను బంధువుల పేర రాయించటం లేదా విక్రయిస్తున్నారన్నారు. రమణమూర్తి మాట్లాడుతూ గ్రామాల్లో నోటి మాటపై రైతులు లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుంటున్నారని, అలాంటి వారు కూడా లైసెన్స్‌లు తీసుకోవాలంటే ఎలాగని అన్నారు. దీనికి మంత్రి బదులిస్తూ ఎవరైనా సరే అప్పు ఇచ్చి ఉంటే విధిగా లైసెన్స్ కలిగి ఉండాల్సిందేనన్నారు.