రాష్ట్రీయం

అత్యవసరానికి అంబుపాడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు పట్టణాల్లో వెళ్లడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్స్ అడ్డుకాకపోయినా, వరుసగా నిలిచిపోయే వాహనాలను తప్పించుకుని ఆపద సమయంలో ఉన్న రోగిని ఆస్పత్రికి చేర్చడం ఒక పెద్ద బృహత్తర కార్యక్రమమే. ఇలాంటి పరిస్థితి నుండి రోగిని సురక్షితంగా మరింత వేగంగా తీసుకువేళ్లేందుకు అనువైన స్టార్టప్‌ను యామిని లావణియన్ రూపొందించారు. తన తండ్రి డాక్టర్ లావణియన్ దొరైరాజు స్ఫూర్తి, మార్గదర్శకంలో అంబుపాడ్ రూపొందించినట్టు యామిని చెప్పారు. ఆమె అంబుపాడ్‌ను ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సులో ప్రదర్శించారు. దానిని ద్విచక్రానికి అనుసంథానం చేసి నేరుగా ఆస్పత్రికి తీసుకువెళ్లడమేగాక, రోగికి అత్యవసరంగా అవసరమయ్యే ఆక్సిజన్ వంటి అత్యవసర వైద్య సౌకర్యాలను అందులో పొందుపరిచారు. చిన్న చిన్న గ్రామాల్లోని వారు సైతం రోడ్లు లేక పెద్ద ఆస్పత్రులకు సకాలంలో చేరడంలో ఇబ్బంది పడుతున్నారని వారంతా ఇపుడు దీనిని తేలికగా వినియోగించుకోవచ్చని పేర్కొంది. నాలుగు లక్షల ఖర్చుతో దీనిని కొనుగోలు చేయవచ్చు.

చిత్రం..యామిని లావణియన్