రాష్ట్రీయం

తెలుగుకు పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: ప్రపంచ తెలుగు మహాసభలను తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న సాహితీవేత్తలందరి సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు సూచించారు. మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పండుగ శోభ సంతరించుకోవాలన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, ముగింపు కార్యక్రమానికి రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతారన్నారు. అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మారిషస్ వైస్ ప్రెసిడెంట్ పరమశివమ్, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు హాజరు కాబోతున్నారని, తోటి తెలుగు రాష్ట్రం ఏపీ సీఎం చంద్రబాబును కూడా దీనికి ఆహ్వానిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో గురువారం సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మహాసభల కోసం రూపొందించిన వేదిక నమునా, లోగోలను పరిశీలించి ఆమోదం తెలిపారు. ప్రారంభ, ముగింపు సభలు రెండూ ఎల్‌బి స్టేడియంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. మిగతా వేదికల వద్ద ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి, సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రధాన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎల్‌బి స్టేడియంలో తెలంగాణ వంటకాల స్టాల్స్‌తో పాటు వివిధ కళా ప్రక్రియలకు సంబంధించిన స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ ఆహార్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలను ప్రతిబింభించేలా లేజర్ షోలు నిర్వహించాలన్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడంతో పాటు నగరాన్ని అందంగా ముస్తాబు చేసి పండుగ శోభను తీసుకురావాలన్నారు. తెలుగు సాహితీమూర్తుల పేర్లతో తోరణాలు ఏర్పాటు చేయాలన్నారు. తెలుగు భాషా ప్రక్రియలతో పాటు హైదరాబాద్ సంస్కృతి ఉట్టిపడేలా ఉర్దూలో కవి సమ్మేళనాలు, కవ్వాలీవంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తెలుగు భాషాభివృద్ధి, సంగీత, సాహిత్య, కళారంగాలకు చెందిన ప్రముఖులను గౌరవించుకోవాలన్నారు.
ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు మంచి వసతి, భోజనం, రవాణా ఏర్పాట్లు చేయాలన్నారు. మహాసభల సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపులు విడుదల చేయాలన్నారు. ఎయిర్‌పోర్టు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విచారణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రముఖ క్రీడాకారులు సైనా నెహ్వాల్, సానియా మీర్జా, మిథాలీరాజ్, పివి సింధు తదితరులను ఆహ్వానించాలని సూచించారు. తెలుగు పండుగలు, సంవత్సరాలు, నెలలు, కార్తెలతో కూడిన పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.

చిత్రాలు..ప్రపంచ తెలుగు మహాసభల కోసం సీఎం కేసీఆర్ ఆమోదించిన వేదిక నమూనా
*ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై నిర్వహించిన ఉన్నతస్థాయ సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్