రాష్ట్రీయం

ఒకే ఒక్కడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: అమెరికా కార్మిక శాఖ మహిళా విభాగం, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఐటి మంత్రి కె తారకరామారావు సూపర్‌హీరోగా నిలిచారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను మినహాయిస్తే ప్రజాప్రతినిధి హోదాలో హాజరైంది ఆయన ఒక్కరే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్‌సిలు ఎవరినీ సదస్సుకు ఆహ్వానించలేదు. ఒకరిద్దరు మాజీలు హాజరైనా వారు పారిశ్రామికవేత్తల హోదాలోనే సదస్సుకు వచ్చారు. చాలా ఉత్సాహంగా సదస్సులో పాల్గొనడం, అన్ని ప్లీనరీల్లో వక్తల అభిప్రాయాలను ఆసాంతం వినడం, అనుమానాలను నివృత్తి చేసుకోవడం, ఉత్సాహంగా పారిశ్రామికవేత్తలను కలిసి మాట్లాడటమేగాక, సదస్సులో ప్రధాన భాగమైన చర్చాగోష్టిల్లో మొట్టమొదటి చర్చకు అదీ శే్వతసౌధం సలహాదారు ఇవాంక ట్రంప్‌తో పాటు ఐసిఐసిఐ ఎండి చందాకొచ్చర్ , బ్రిటన్ మాజీ ప్రధాని టోనిబ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్ పాల్గొన్న కార్యక్రమానికి సమన్వయకర్తగా అద్భుతంగా వ్యవహరించడం కూడా అందరినీ ఆకట్టుకుంది. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా సందర్భానుచితంగా జోక్యం చేసుకుంటూ తెలంగాణ ప్రాధాన్యతను, ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకువెళ్లడంలో విజయం సాధించారు.
ఒక పక్క సదస్సు ఏర్పాట్లు, ఇంకో పక్క భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించడంతో పాటు సదస్సులోని అంశాలు, రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను రాబట్టడంలోనూ మూడు రోజులు మమేకమైపోయారు. వాస్తవానికి తారకరామారావు గత నెల రోజులుగా చేసిన కసరత్తు బాగా కలిసొచ్చింది. తొలి చర్చాగోష్టిలో ఇవాంక ట్రంప్‌ను సైతం ధీటుగా ఎదుర్కోవడమే గాక, అలవోకగా వారికి కొన్ని ప్రశ్నలు వేయడం, కెటిఆర్ తీరు చూసిన ఇవాంక సైతం మున్ముందు జరిగే కార్యక్రమాల్లో కెటిఆర్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని భావించడం ద్వారా తనదైన ముద్ర వేసుకున్నారు. పదే పదే తెలంగాణ కొత్త రాష్టమ్రని, 40నెలల పసితనంతో ఉందని, అయినా ప్రపంచం గుర్తెరిగేలా ఎన్నో అద్భుతాలను అపుడే సృష్టించామని కెటిఆర్ వివరించగలిగారు. ప్రధానంగా టి హబ్ ప్రత్యేకతను ఇవాంక సైతం తన ప్రధాన ఉపన్యాసంలో ప్రస్తావించడం ద్వారా ఐటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన ప్రత్యేక ముద్రను అంతా ఎండార్స్ చేసినట్టయింది. మాటలు, చేతలతోనే కాకుండా క్లిస్టమైన అంశాలను సైతం తేలికగా ఆయన ఎదుర్కొని సమయస్ఫూర్తితో సమాధానాలు ఇచ్చారు. ప్రధానంగా మహిళల ప్రాధాన్యత గురించి పదే పదే చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో మహిళల ప్రస్తావన వచ్చినపుడు , ప్రపంచంలో పెద్ద ఎత్తున మహిళా సంఘాల సమన్వయంపై చర్చ జరిగినపుడు తెలంగాణ ప్రత్యేకతను స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం అమలుచేయని రీతిలో ప్రత్యేక పారిశ్రామిక విధానం గురించి కూడా చెప్పడంతో చాలా దేశాల ప్రతినిధులు ఈ విధానంపై ఆసక్తిని చూపారు. హైదరాబాద్ నగరాన్ని, మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లడంలో కెటిఆర్ సమయోచితంగా వ్యవహరించడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపచేశారని పార్టీ నేతలు సైతం కొనియాడుతున్నారు. మెట్రో ఆవిష్కరణ కార్యక్రమంలో సైతం ప్రధాని నరేంద్రమోదీ దృష్టిని ఆకర్షించారు. ప్రత్యేకించి ప్రధాని కొద్ది సేపు ఎదురుచూసి కెటిఆర్ ఎక్కడ అంటూ పిలిపించుకుని పక్కనే కూర్చోబెట్టుకోవడం కూడా మిగిలిన వారిని ఫిదా చేసింది. ముగింపు కార్యక్రమంలోనూ ఆయన ప్రత్యేకతను ప్రదర్శించారు. మూడు రోజుల సదస్సులో 53 చర్చాగోష్టిలు జరగ్గా అందులో 200 మంది మాట్లాడారని చెప్పారు.
అమెరికాకు ఆహ్వానించిన ఇవాంక
తెలంగాణ ఐటి మంత్రి కె తారకరామారావును అమెరికా తమ దేశానికి ఆహ్వానించింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఉత్సాహంగా పాల్గొనడమేగాక, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు అబ్బురపడేలా ఏర్పాట్లు చేయడంలో ముందున్న కేటీఆర్‌ను అమెరికా శే్వతసౌధం సలహాదారు ఇవాంక ట్రంప్ ఆహ్వానించినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కేటీఆర్ అమెరికా వెళ్లి ఇవాంకతో భేటీ కానున్నారు. కార్యక్రమాన్ని విజయంతం చేయడమేగాక, ప్రధాని విందు, రాష్ట్ర ప్రభుత్వ విందులను స్వయంగా పర్యవేక్షిస్తూ కేటీఆర్ అందరి దృష్టినీ ఆకర్షించారు. మరో పక్క తాను అమెరికా పర్యటనను రూపొందించుకుంటున్నట్టు కేటీఆర్ చెప్పడంతో, దానికి ఇవాంక సైతం సానుకూలంగా స్పందించారని సమాచారం.
మహిళా పారిశ్రామికవేత్తలకు వీ హబ్
రానున్న రోజుల్లో మహిళా పారిశ్రామిక వేత్తల కోసం కేటిఆర్ మూడు నిర్ణయాలను ప్రకటించారు. వీ హబ్ అంటే ఉమెన్ ఎంపవర్‌మెంట్ హబ్ అని మంత్రి చెప్పారు. మహిళా పారిశ్రామివేత్తలకు 15 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే వస్తువుల విషయంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. అలాగే ప్రభుత్వం కొనుగోళ్లిలో నాలుగో వంతు మహిళా పారిశ్రామిక వేత్తల నుండి కొంటామని అన్నారు. నీటి ఆయోగ్ ఆ నాలుగు మెట్రో నగరాలవైపే కాకుండా హైదరాబాద్ వైపు కూడా చూడాలని చమత్కరించారు.