రాష్ట్రీయం

మాటవినకుంటే అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీకి విముఖంగా ఉన్న డీలర్లను తక్షణమే తొలగించి, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సీఎం కె.చంద్రశేఖరరావు పౌరసరఫరాల శాఖను ఆదేశించారు. పేదల కడుపు నింపేందుకు ఉద్దేశించిన బియ్యం పథకానికి తూట్లు పొడుస్తూ కొంతమంది సమ్మె పేరుతో డిసెంబర్ నెల బియ్యం కోసం డీడీలు కట్టకపోవడం బాధాకరమన్నారు. డీడీలు కట్టిన రేషన్ డీలర్లకు సరుకులు పంపిణీ చేసి, కట్టని డీలర్ల వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గురువారం ప్రగతి భవన్‌లో పౌరసరఫరాల శాఖపై సంబంధిత మంత్రి ఈటల రాజేందర్, శాఖ కమిషనర్ సివి ఆనంద్‌తో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల వ్యవహారాన్ని వారు సీఎం దృష్టికి తెచ్చారు. రాష్టవ్య్రాప్తంగా 14 వేల మంది డీలర్లలో 25 జిల్లాలకు చెందిన దాదాపు 7 వేల మంది ఇప్పటికే డీడీలు కట్టి సరుకుల పంపిణీకి సిద్ధమయ్యారని, మిగిలిన వారు మాత్రం తమకు వేతనాలు పెంచాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలనే డిమాండ్‌తో డీడీలు కట్టలేదని వారు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో కొన్నిచోట్ల డిసెంబర్‌లో సరుకుల పంపిణీ జరిగే పరిస్థితి లేదని వివరించారు. దీనిపై స్పందించిన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సరుకుల
పంపిణీకి డీలర్లు కమీషన్ పద్దతిలో పని చేస్తున్నారని, కానీ వారు అసమంజసమైన కోరికలు కోరుతూ సమ్మె చేస్తామని చెప్పడం బాధాకరమని అన్నారు. ఈ సమ్మె పిలుపునకు అర్ధం లేదని వ్యాఖ్యానించారు. డీలర్ల చర్యల వల్ల పేదలకు బియ్యం పంపిణీ అందని పరిస్థితిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. డిడిలు కట్టని వారిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు.
తాము సమ్మెలో పాల్గొనడంలేదు
ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెలో పాల్గొనడం లేదని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ప్రకటించారు. నవంబర్‌లో మూడు రోజుల సమ్మె చేసినప్పుడు అందుకు ప్రభుత్వం స్పందించి, సమస్యల పరిష్కారానికి ఖచ్చితమైన హామీ ఇవ్వడం వల్ల తాము సమ్మె విరమించినట్లు వెల్లడించామని చెప్పారు. అందుకే ఓ వర్గం వారు డిడిలు కట్టకుండా చేస్తున్న సమ్మెలో తాము పాల్గొనడం లేదని రాజు స్పష్టం చేశారు. అయితే తమ సమస్యలు త్వరగా పరిష్కరించకుంటే ఆంతోళన చేస్తామని తెలిపారు.