రాష్ట్రీయం

మహిళలపై నేరాల్లో తెలంగాణకు 4, ఏపీకి 9వ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: మహిళలపై జరిగిన వివిధ నేరాల్లో దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉండగా, తెలంగాణ 4వ స్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ప్రకటించింది. 2016లో వివిధ రాష్ట్రాల్లో మహిళలపై నేరాల గణాంక వివరాలను ఎన్‌సిఆర్‌బి వెల్లడించింద. తెలంగాణలో 2015తో పోల్చితే 2016లో మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టగా, ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు పెరిగాయి. తెలంగాణలో మహిళలపై నేరాలకు సంబంధించి తెలంగాణలో 2014లో 14,417 కేసులు, 2015లో 15,425 నేరాలు, 2016లో 15374 నేరాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2014లో 16,526 నేరాలు, 2015లో 15,967 కేసులు, 2016లో 16362 నేరాలు నమోదయ్యాయి.
తెలంగాణలో మహిళలపై వివిధ నేరాలకు సంబంధించి వివరాలను విశే్లషిస్తే, 2016లో వరకట్నం మరణాల కేసులు 254, బాధితులు 254, మహిళలు ఆత్మహత్యకు పురికొల్పిన ఘటనలు 560 నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో వరకట్నం మృతుల కేసులు 193, మహిళలు ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలు 405 నమోదయ్యాయి. మహిళలపై యాసిడ్ దాడులు ఆంధ్రాలో 9 ఘటనలు జరిగాయి. భార్యల పట్ల భర్తలు, కుటుంబ సభ్యుల క్రూరత్వ కేసులు ఆంధ్రాలో 6461 కేసులు, తెలంగాణలో 7202 కేసులు నమోదయ్యాయి. మహిళలపై కిడ్నాప్‌లకు సంబంధించి ఆంధ్రాలో 626 సంఘటనలు, కిడ్నాప్ చేసిన హత్య చేసిన ఘటనలు 3, డబ్బు కోసం కిడ్నాప్ ఘటనలు నమోదయ్యాయి. తెలంగాణలో మహిళల కిడ్నాప్ ఘటనలు 987 నమోదయ్యాయి. కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలన్న ఘటనలు ఆంధ్రాలో 163, యువతులను లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణా నిమిత్తం కేసులు 31 నమోదయ్యాయి. తెలంగాణలో కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలన్న కేసులు 260, యువతుల అక్రమరవాణా కేసులో 13నమోదయ్యాయి.
మహిళలపై అత్యాచారాల ఘటనలను విశే్లషిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2016లో 994 కేసులు, గ్యాంగ్ రేప్‌లు 15, తెలంగాణలో అత్యాచారాలు 1278, గ్యాంగ్ రేప్ కేసులు 15 నమోదయ్యాయి. ఐపిసి నేరాలను విశే్లషిస్తే అత్యాచారానికి ప్రయత్నించిన కేసులు ఆంధ్రాలో 190, తెలంగాణలో 44 నమోదయ్యాయి. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన కేసులు ఆంధ్రాలో 4829 కేసులు, తెలంగాణలో 3767 కేసులు నమోదయ్యాయి. ఇందులో మహిళలపై లైంగిక కేసుల వేధింపులు ఆంద్రాలో 1305 కేసులు, తెలంగాణలో 859 కేసులు నమోదయ్యాయి. మహిళలను చాటుమాటుగా చూడడం, అసభ్యంగా మాట్లాడే కేసులు ఆంధ్రాలో 83, తెలంగాణలో 98, నమోదయ్యాయి. తెలంగాణలో ఐపిసి సెక్షన్ల కింద మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 2016లో 15107 కేసులు, ఆంధ్రాలో 15572 కేసులు నమోదయ్యాయి.
బాలికలపై అత్యాచారాలు
పసిబాలికలపై నేరాలనువిశే్లషిస్తే ఆంధ్రాలో ఆరు సంవత్సరాల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన కేసులు 17, 6 నుంచి 12 సంవత్సరాలలోపు బాలికల రేప్ ఘటనలు 43, 12 నుంచి 16 సంవత్సరాలలోపు బాలికలపై 142 అత్యాచారాల ఘటనలు, 16 నుంచి 18సంవత్సరాల బాలికలపై 261 అత్యాచారాల ఘటనలు చోటు చేసుకున్నాయి.
18 నుంచి 30 సంవత్సరాల లోపు మహిళలపై అత్యాచారాల ఘటనలు 436, 30-45 సంవత్సరాల మధ్య మహిళలపై రేప్ ఘటనలు 85, 45-60 సంవత్సరాల మధ్య మహిళలపై రేప్ ఘటనలు 9, 60 సంవత్సరాలు దాటిన మహిళలపై రేప్ ఘటనలు 2 నమోదయ్యాయి. తెలంగాణలో ఆరు సంవత్సరాల లోపు పసిబాలికలపై అత్యాచారఘటనలు 25, ఆరు నుంచి 12 సంవత్సరాల లోపుబాలికలపై 65 ఘటనలు, 12-16 సంవత్సరాలమధ్య బాలికలపై ఘటనలు 272, 16-18 మధ్య 257 కేసులు నమోదయ్యాయి. పసిబాలికలపై ఆంధ్రాలో రేప్ ఘటనలు 463, తెలంగాణలో 619 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 18-30 మధ్య మహిళలపై ఘటనలు 480, 30-45 మధ్య మహిళలపై ఘటనలు 137, 45-60 మధ్య మహిళలపై ఘటనలు 26, 60 సంవత్సరాలు దాటిన మహిళలపై అత్యాచార ఘటనలు 16 నమోదయ్యాయి.
ఆర్థిక నేరాలు
ఆర్థిక నేరాల్లో తెలంగాణ దేశం మొత్తం మీద 3వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో నిలిచింది. ఆంధ్రాలో 2014లో 6387, 2015లో 6669, 2016లో 5931 నేరాలు జరిగాయి. ఇక్కడ నేరాలు 2015తో పోల్చితే తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో కూడా ఆర్థిక నేరాలు 2015తో పోల్చితే పెరిగాయి. 2015లో 8979 కేసులు, 2016లో 9286 కేసులు నమోదయ్యాయి. 2016లో ఆంధ్రాలో నమ్మక ద్రోహం కింద 764 కేసులు, చీటింగ్ కేసులు 4877, ఫోర్జరీ కేసులు 228 కేసులు, నకిలీ నోట్ల చలామణి కేసులు 62 కలిపి మొత్తం ఆర్థిక నేరాలు 5931 నమోదయ్యాయి. తెలంగాణలో నమ్మక ద్రోహం కేసులు 639, చీటింగ్ కేసులు 8394 కేసులు, ఫోర్జరీ కేసులు 193, నకిలీ నోట్ల చలామణి కేసులు 60 కేసులు కలిపి 9286 కేసులు నమోదయ్యాయి.