రాష్ట్రీయం

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 1: కాపుల చిరకాల స్వప్నం బీసీ హోదా సాకారంకానుంది. ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీకి కేంద్రం ఆమోదం లభిస్తే చట్టరూపం దాల్చనుంది. బీసీ కమిషన్ సిఫార్సు మేరకు కాపులను బీసీల్లో చేర్చుతూ మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం ద్వారా సిఎం చంద్రబాబు కాపుల పెదవులపై చిరునవ్వులు పూయించారు. ఆమేరకు కాపులకు మూడున్నరేళ్ల క్రితం ఇచ్చిన మాట నిలబెట్టుకుని మేనిఫెస్టో అమలు జాబితాలో కాపు రిజర్వేషన్లనూ విజయవంతంగా చేర్చారు. దశాబ్దాల నుంచి డిమాండుకే పరిమితమైన కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులాలకు బీసీ రిజర్వేషన్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. దీనిపై ప్రభుత్వం వేసిన బీసీ కమిషన్ నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించడం, దాన్ని పరిశీలించి మంత్రిమండలి భేటీలో టేబుల్ అజెండాగా పెట్టి ఆమోదించడం చకాచకా జరిగిపోయాయి. వారికి 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న బీసీ కమిషన్ నివేదికకు ప్రభుత్వం కూడా ఆమోదముద్ర వేసింది. శనివారం జరగనున్న శాసనసభ, మండలి సమావేశాల్లో దాన్ని ప్రవేశపెట్టి గవర్నర్ ఆమోదానికి పంపిన అనంతరం కేంద్రానికి పంపనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు ఉన్న విషయం తెలిసిందే.
అయితే, కాపువర్గాలకు బీసీ హోదా ఇచ్చినా బీసీల ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తపడినట్లు కనిపిస్తోంది. కాపులను బీసీ-ఎఫ్ కేటగిరీలో చేర్చింది. వారికి విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో తప్ప రాజకీయ రిజర్వేషన్లు ఉండవన్న నిబంధన చేర్చడం ద్వారా బీసీలను మెప్పించింది. అటు కాపులు కూడా తమకు రాజకీయ రిజర్వేషన్లు వద్దని చెబుతుండటం, ఇటు బీసీలు కూడా తమకు ఇబ్బంది కలిగించకుండా వారికి రిజర్వేషన్లు ఇస్తే ఇబ్బంది లేదని స్పష్టం చేయడంతో, ప్రభుత్వం రెండు వర్గాలనూ మెప్పించే నిర్ణయం తీసుకుంది.
తొలుత చైర్మన్ జస్టిస్ మంజునాథ, ముగ్గురు సభ్యులతో కూడిన సభ్యుల బృందం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాలు, వినతిపత్రాలు స్వీకరించింది. ఆ సందర్భంగా బీసీ, కాపు సంఘాలు అనేకచోట్ల ఘర్షణలకూ దిగాయి. గతంలో తునిలో ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపుగర్జనలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సందర్భంలో ఆందోళనకారులు రైళ్లు, పోలీసుస్టేషన్లు తగులబెట్టారు. తర్వాత దానిపై వైసీపీ నేత కరుణాకర్‌రెడ్డి వంటి ప్రముఖులను సీఐడీ విచారించి, ఆ ఘటనలో బాధ్యులను అరెస్టు చేశారు. ఈలోగా మళ్లీ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్షల పేరిట ఒత్తిడి పెంచి డెడ్‌లైన్లు పెడుతుండటంతో ఈ వ్యవహారానికి తెరదించాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు. దానితో మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడులకు త్వరగా కమిషన్ నివేదిక తెప్పించే బాధ్యత అప్పగించారు.
కాగా ఈ విషయంలో చంద్రబాబు సర్కారు గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగులు వేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ జీఓ జారీ చేశారు. అయితే దానికి చట్టబద్ధత లేదని హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని, దానికిమించి ఇవ్వాల్సివస్తే ఎవరికైతే సామాజికంగా అన్యాయం జరిగిందని భావించారో, వాటిపై జనగణన చేయించాలని స్పష్టం చేసింది. ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న బాబు, కమిషన్ సిఫార్సుల మేరకు దానికి చట్టబద్ధత కల్పించాలని భావించారు. లేకపోతే ముద్రగడ, తదితర కాపు నేతల డిమాండ్లకు వెంటనే అంగీకరించి జీఓ ఇచ్చిఉంటే మునుపటి మాదిరిగానే దానికి కోర్టులో చుక్కెదురయ్యేది.
*
కట్టకడకిక బాబు ఓ మెట్టుదిగగ
ఎట్టకేలకు కాపుల పట్టునెగ్గె
తుట్టతుదకిక బీసీల చిట్టనెక్క
చిట్టచివరికేవౌ కోర్టు మెట్టుమీద?