రాష్ట్రీయం

12 రోజులు.. 67.48 గంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు/విజయవాడ, డిసెంబర్ 2: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు శనివారంతో ముగిసాయి.. గత నెల 10వ తేదీ నుండి సమావేశాలు ప్రారంభం కాగా 12 రోజుల పనిదినాల్లో మొత్తం 67 గంటల 48 నిముషాల పాటు సాగాయి.. సమావేశ వివరాలను శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వివరించారు. మొత్తం 94 ప్రశ్నలకు సమాధానాలు మరో 22 ప్రశ్నలు టేబుల్ ఐటమ్‌గా స్వీకరించారు. 13 షార్ట్ నోటీసులకు సమాధానాలు ఇవ్వగా మరో 8 టేబుల్ ఐటమ్‌గా అందాయి. రూల్ 74 కింద 7, 344 కింద 6 అంశాలపై చర్చించారు. మంత్రులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఒకటి రికార్డు కాగా 16 బిల్లులు సభ ముందు ఉంచారు. రెండు బిల్లులు ఉపసంహరించుకున్నారు. మిగిలిన 16 బిల్లులు ఆమోదం పొందాయి. కాపులకు బీసీ రిజర్వేషన్‌తో సహా 5 తీర్మానాలను శాసనసభ ఆమోదించింది. సమావేశాల్లో 382 సార్లు శాసనసభ్యులకు వివిధ అంశాలపై చర్చించే అవకాశం లభించింది. ఒక నివేదికతో పాటు పది లఘు ప్రశ్నలపై సభ్యులు చర్చించారు. శాసనసభ సమావేశాల్లో తొలిసారిగా ప్రతిపక్షం లేకుండా సుదీర్ఘ సమయంపాటు చర్చించటం విశేషం. బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు ఒకరే ఒకింత ప్రతిపక్ష పాత్ర పోషించారు. సమావేశాలు ఆసాంతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌లను అమాంతం పొగడ్తలతో ఎమ్మెల్యేలు ముంచెత్తటం మరో విశేషం. చివరిరోజున యువత- ఉపాధి అంశంపై జరిగిన లఘు చర్చలో సైతం సీఎంను అపర భగీరథుడిగా.. అభినవ అంబేద్కర్‌గా కీర్తిస్తూ సభ్యులు చర్చను పొడిగించడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంబంధిత అంశంపైనే చర్చ సాగాలని సున్నితంగా చురకలంటించటం కొసమెరుపు.
51 గంటల పాటు సమావేశమైన మండలి
రాష్ట్ర శాసన మండలి 29వ సెషన్‌లో 51 గంటలపాటు సమావేశమైంది. గత నెల 10న ప్రారంభమైన సమావేశాలు శనివారంతో ముగిశాయి. 12 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 100 స్టార్డ్ ప్రశ్నలకు, 7 అన్-స్టార్డ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 16 బిల్లును ఆమోదించగా, ఆరు షార్టు డిస్కషన్స్, నాలుగు తీర్మానాలను మండలిలో చేశారని డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు.