రాష్ట్రీయం

యువజన సాధికారతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 2: దేశానికి యువశక్తి ఓ సంపద.. ఆ శక్తిని వినియోగించుకుంటే ప్రపంచాన్ని శాసించే శక్తి భారత్‌కే ఉంటుంది.. నవ్యాంధ్రప్రదేశ్‌కు భారీ పరిశ్రమలు వస్తున్నాయి.. ప్రైవేటు కంపెనీలతో పాటు ప్రభుత్వరంగ సంస్థలలో ఉపాధి కల్పనకు ప్రణాళిక సిద్ధం చేశాం. నిరుద్యోగ యువతకు అర్హత ఆధారంగా భృతి కల్పించడంతో పాటు భవిష్య త్తుకు బాట వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. శాసనసభలో శనివారం యువత- ఉపాధికల్పన- నిరుద్యోగ భృతి అంశాలపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పనతో పాటు సాధికారత పెంచాలనేది లక్ష్యంగా చెప్పారు. దేశంలో మరో 30,40 సంవత్సరాల వరకు యువజనులే అధిక సంఖ్యలో ఉంటారని సర్వేలో వెల్లడైందన్నారు. యువత భవితకు పది సూత్రాలతో విధాన రూపకల్పన జరుగుతోందని తెలిపారు. ఉపాధికల్పన, సాధికారత, విద్య, వైద్యం, ఆరోగ్యం, రిక్రియేషన్, సాంఘిక సమానత్వం, సామాజిక సేవ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న విదేశీ కంపెనీల ప్రతినిధులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేసి ఉత్సాహవంతులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలనేది ప్రణాళిక లక్ష్యమన్నారు. ఐటీ సెక్టార్‌లో ప్రపంచ స్థాయిలో మనదేశానికి చెందిన వారే సీఈఓలుగా ఎదిగారని, గత మూడున్నరేళ్లలో సీఐఐ సదస్సులలో పెద్దఎత్తున అవగాహన ఒప్పందాలు జరిగాయన్నారు. మొత్తం 1084 ఒప్పందాలకు 17లక్షల కోట్ల పైచిలుకు పరిశ్రమలు దశలవారీ రాష్ట్రానికి రానున్నట్లు వివరించారు. ఇంజనీర్లకు నిరుద్యోగ భృతితో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తాం.. దశలవారీగా భృతి కల్పించడంతో పాటు అర్హత ఆధారంగా ఉన్నత చదువులు.. ఉద్యోగావకాశాలు వచ్చేంత వరకు ఆర్ధిక సాయం అందిస్తామన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా కళాశాల విద్యార్థులను భాగస్వాములను చేస్తామని తెలిపారు. యువజన పురోభివృద్ధితోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యపడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది.. విభజన హేతుబద్ధంగా జరగలేదు.. అప్పులు మిగిలాయి.. పెట్టుబడుల కోసం దేశాలు తిరుగుతున్నాం..పారిశ్రామిక సదస్సులలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు ముందుకొస్తున్నారు.. ఇందులో భాగంగానే రాష్ట్ర వృద్ధిరేటు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే 11.2కు చేరిందని సీఎం వివరించారు. విభజనతో యువత నిర్వీర్యమై ఉన్నారు. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదులక్షల మందికి ఉపాధి కల్పించాం.. భవిష్యత్తులో 20 లక్షల మందికి ఉపాధితో పాటు పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా స్వయం ఉపాధితో సాధికారత సాధించాలనేదే ఆకాంక్ష అన్నారు. ఇప్పటి వరకు లక్షా 33వేల 376 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయన్నారు.