రాష్ట్రీయం

బాబు.. పంచ్‌తంత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 2: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టిన చందంగా సిఎం చంద్రబాబు కాపువర్గాలకు ఐదుశాతం రిజర్వేషన్ ప్రకటించి రాజకీయ ప్రత్యర్థులను వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. బాబు ప్రకటించిన 5 శాతం రిజర్వేషన్ అమలుకు నోచుకోవాలంటే కేంద్రం మద్దతు తప్పనిసరి. అసెంబ్లీ తీర్మానానికి చట్టబద్ధత కల్పించాలంటే ఆ బిల్లును 9వ షెడ్యూలులో చేర్చాల్సి ఉంటుంది. అలా చేస్తేనే దానికి న్యాయరక్షణ ఉంటుంది. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు అదే 9వ షెడ్యూలును సమీక్షించేందుకు సిద్ధమవుతోంది. గుజ్జర్లు, జాట్లు, పటేళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణా ప్రభుత్వాలు రూపొందించిన రిజర్వేషన్లనూ కొట్టివేసింది.
అయితే, తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీసీ కమిషన్ ద్వారా గణన చేయించి, అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. ఆ సందర్భంలో తమ నిర్ణయాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, లేకపోతే పోరాడి సాధిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు సీఎం చంద్రబాబూ కేసీఆర్ దారిలోనే కాపుల రిజర్వేషన్ వ్యవహారం సుఖాంతం చేసినట్లు కనిపిస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో కాపువర్గాలు కాంగ్రెస్‌పై వ్యతిరేకత, బాబు ఇచ్చిన హామీ, పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమానంతోనే టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాయి. తర్వాత 9 నెలలైనప్పటికీ దానిపై కదలిక లేకపోవడంతో ముద్రగడ పద్మనాభం ఉద్యమం ప్రారంభించారు. తునిలో భారీ సభ నిర్వహించిన సందర్భంలో అది హింసాత్మకంగా మారింది. అందులో పాల్గొన్నారన్న అనుమానంతో పోలీసులు 13 జిల్లాల్లోని కాపు యువకులకు పోలీసుస్టేషన్లకు పిలిపించి హింసించడం, కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించిన ముద్రగడ, దీక్షలకు సిద్ధం కావడంతో టీడీపీపై కాపుల్లో వ్యతిరేకత మొదలయింది. ముద్రగడ అరెస్టుతో వ్యతిరేకత మరింత పెరిగింది. ముద్రగడ ఉద్యమానికి అటు వైసీపీ కూడా బహిరంగ మద్దతు ప్రకటించింది.
ముద్రగడ దీక్ష వల్ల ఆయన ఇమేజ్ పెరగకపోయినా, కాపు యువతను బాబు వ్యతిరేకదారిలో మళ్లించడంలో మాత్రం ముద్రగడ విజయం సాధించారు. ఆ వ్యతిరేకతను తగ్గించడానికి బాబు కాపు మంత్రులు, నేతలను ముద్రగడపై ప్రయోగించాల్సి వచ్చింది. తాజాగా తీసుకున్న 5 శాతం రిజర్వేషన్ నిర్ణయంతో కాపు యువతలో ఇప్పటివరకూ ముద్రగడ పెంచిన వ్యతిరేకతకు బాబు తెరదించారు.
బాబు తీసుకున్న నిర్ణయాన్ని ముద్రగడ తప్ప, రాష్ట్రంలో ఉన్న కాపు సంఘాలు, నేతలెవరూ వ్యతిరేకించకపోవడం ప్రస్తావనార్హం. మరికొన్ని సంఘాలు మిశ్రమ స్పందన మాత్రమే వ్యక్తీకరించాయి. ముద్రగడ కూడా బీసీ రిజర్వేషన్లపై
స్పందించేందుకు 24 గంటలు తీసుకున్నారంటే, దాని సంకట ప్రభావం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. దీనితో బాబు అటు ముద్రగడ, ఇటు ఆయనకు దన్నుగా నిలిచిన వైసీపీని ఒకేసారి దెబ్బతీసినట్టయింది. విజయవాడ కాపు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అయితే ఏకంగా బాబుకు పాదాభివందనం చేయగా, బీజేపీకి చెందిన మంత్రి మాణిక్యరావు సహా కాపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులంతా అసెంబ్లీలోని బాబు చాంబరుకు క్యూలు కట్టి అభినందలతో ముంచెత్తారు.
ఇక మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర అవసరాలు తీర్చడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీనీ బాబు ఈ వ్యవహారంలో వ్యూహాత్మకంగా ఇరికించారు. బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిన బాధ్యతను బాబు నేర్పుగా బీజేపీపైనే పెట్టారు. రేపటి నుంచి కాపుల రిజర్వేషన్ చట్టబద్ధతపై ఎవరు మాట్లాడినా, ముందు బీజేపీని నిలదీసే పరిస్థితి కల్పించారు. తాము కాపుల కోసం రిజర్వేషన్ కల్పించామని, దానికి చట్టబద్ధత కల్పించాల్సింది కేంద్రమే కాబట్టి, అంతా కలసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని టీడీపీ లౌక్యంగా చెప్పి తప్పించుకుని, బీజేపీని తెరపైకి తీసుకువచ్చే చాణక్యమే ఈ వ్యూహంలో కనిపిస్తోంది. ఈ విషయంలో అటు వైసీపీ కూడా ఏమీ ఒత్తిడి చేయలేని పరిస్థితి సృష్టించారు. కాపుల రిజర్వేషన్లపై వైసీపీ దాడి చేసే ప్రతిసారీ ‘రిజర్వేషన్‌పై తీర్మానం చేసిన మాపై కాదు. మీకు ధైర్యం ఉంటే కేంద్రంపై పోరాడాల’ని ఎదురుదాడి చేసే అవకాశాన్ని కల్పించుకుంది.