రాష్ట్రీయం

ఇంజినీరింగ్.. ఈజీ కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 2: అరకొర, అత్తెసరు మార్కులు వచ్చినా ఇంజినీరింగ్ సీటు వస్తుందన్న భావనలో ఉన్న విద్యార్థులు ఇక ముందు తమ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. వచ్చే ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షలో సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు పొంది మంచి ర్యాంకు సాధించగలిగితేనే ఇంజినీరింగ్ విద్యనభ్యసించడానికి వీలవుతుంది. లేదంటే ప్రత్యామ్నాయ విద్య ఎంపిక చేసుకోవాల్సిందే. విద్యార్థులు ఇంతకాలం ఆడుతూ పాడుతూ ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష రాసినా ఏదో ఒక కాలేజీలో సీటు వచ్చేది. ఇకముందు అలాంటి అవకాశం లేదని తెలుస్తోంది. ఇందుకు కారణం రాష్ట్రంలోని 300కు పైగా ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు తాము కళాశాలలను నిర్వహించలేమని, గుర్తింపు రద్దు చేయాలంటూ ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకున్నాయి. వీటి అభ్యర్థనను ఏఐసీటీఈ అంగీకరిస్తే ఒక్కో కళాశాలలో నిర్వహిస్తున్న కోర్సులను బట్టి 180 నుంచి 260 సీట్ల వరకూ రద్దవుతాయని ఇంజినీరింగ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. అంటే సుమారు 60 వేలకు పైగా ఇంజినీరింగ్ సీట్లు తగ్గనున్నాయి. గత ఏడాది వరకూ విద్యార్థులు లక్ష ర్యాంకు వచ్చినా సీటు పొందేవారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే ఏడాది నుంచి 50, 60 వేల లోపు ర్యాంకు వస్తేనే ఇంజినీరింగ్ విద్య అభ్యసించడానికి వీలవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇక మంచి కళాశాలలో సీటు రావాలంటే ఎంత మంచి ర్యాంకు వస్తే అంత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదంటే ఏదో ఒక కళాశాలలో విద్యార్థులు సర్దుకోవాల్సి వస్తుందని వారంటున్నారు.
ఇంజినీరింగ్ విద్యపై విద్యార్థులు మక్కువ చూపిన సమయంలో ప్రైవేట్ యాజమాన్యాలు పెద్దఎత్తున కళాశాలలు ఏర్పాటు చేశాయని వారంటున్నారు. దాంతో సాదాసీదా విద్యార్థులు సైతం ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడంతో
ఇంజినీర్ల సంఖ్య భారీగా పెరిగిపోయిందంటున్నారు. దీంతో ఇప్పటికే ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన వారిలో అనేక మందికి సరైన ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారని వారు స్పష్టం చేస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యతో పాటు సరైన శిక్షణ పొంది సర్ట్ఫికెట్ సంపాదించిన వారిలో అత్యధికులు మంచి ఉద్యోగం పొంది స్థిరపడ్డారని వెల్లడిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యనభ్యసించినా ఉద్యోగానికి భరోసా లేదని తేలడంతో విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే ప్రత్యామ్నాయ విద్యను అభ్యసించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయని పేర్కొంటున్నారు. మరోవైపు విద్యార్థులు లేక, సీట్లు భర్తీ కాక అధ్యాపకులకు జీతాలు, కళాశాలల నిర్వహణ ఖర్చు పెరిగిపోవడంతో మూసివేయడం మినహా మరోమార్గం లేకపోవడంతో మూసివేతకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడిస్తున్నారు. ఇకపై ఇంజినీరింగ్ విద్యనభ్యసించాలంటే విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించి ర్యాంకు పొందగలిగితేనే సీటు వస్తుందని లేదంటే ప్రత్యామ్నాయ విద్య తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు.