రాష్ట్రీయం

భగ్గుమన్న బీసీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 5: కాపు వర్గాలకు 5 శాతం రిజర్వేషన్లు సిఫార్సు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీలు భగ్గుమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీ సంఘాలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతమైంది. కాపులకు రిజర్వేషన్‌ను అడ్డుకోవడంలో బీసీ మంత్రులు విఫలమయ్యారని, బీసీ జాతి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారంటూ ఆందోళనకారులు ఆగ్రహంతో రగిలిపోయారు. రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టరేట్లు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, నిరసనలతో అట్టుడికిపోయాయి. కాపులకు రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మంగళవారం కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు ఇచ్చింది. ఆమేరకు అన్ని జిల్లాల్లో బీసీ సంఘాలు భారీ సంఖ్యలో హాజరై తమ నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందచేశాయి. గుంటూరులో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్‌రావు నేతృత్వంలో కార్యకర్తలు, పోలీసులకు ఘర్షణ తలెత్తింది. తాము కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తామని ముందుగానే ప్రకటించినప్పటికీ అడ్డుకోవడం దారుణమని, ప్రభుత్వం బీసీలను అణచివేసే విధానం అవలంబిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చినందున నష్టమేమీ లేదని చెబుతున్న బీసీ మంత్రులు, ఏవిధంగా నష్టం జరగదో వచ్చి చెప్పాలని సవాల్ చేశారు. దీనిపై న్యాయస్థానంతోపాటు ప్రజాక్షేత్రంలో పోరాడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లా కలెక్టరేట్ల వద్ద మాట్లాడిన పలువురు బీసీ సంఘాల నేతలు, బీసీ మంత్రులు తమ పదవుల కోసం ప్రభుత్వానికి సాగిలబడ్డారని, వారికి ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా వెంటనే పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీసీ మంత్రుల చేతకాని తనం వల్లే కాపులకు రిజర్వేషన్లు ఇచ్చారని, ఈ విషయంలో కాపు ప్రజాప్రతినిధులు ఐక్యంగా వ్యవహరిస్తే, బీసీ ప్రజాప్రతినిధులు పదవులు పట్టుకుని పాకులాడినందుకే బీసీ జాతికి నష్టం జరిగిందని విరుచుకుపడ్డారు.
మంజునాథ నివేదికను వెల్లడించాలి: కేశన
గుంటూరు: గుంటూరులో జరిగిన కలెక్టరేట్ ముట్టడిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ హోదా కలిగిన చైర్మన్ నివేదికను కాకుండా కేవలం సభ్యుల నివేదికను పరిగణలోకి తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. అధికారపార్టీలోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు కాపుల రిజర్వేషన్లతో బీసీలకు ఎటువంటి నష్టం వాటిల్లదని చెప్తున్నారని, ఏవిధంగా నష్టం జరగదో బీసీలకు స్పష్టం చేయాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఎ,బి,సి,డి గ్రూపులకు ఉన్నాయని, అయితే ఈ వర్గీకరణకు చట్టబద్ధత లేదన్నారు. కాపులకు ఎఫ్ అనే గ్రూపు పెట్టి 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తే వారు ఆ 5 శాతంలోనే పోటీ చేస్తారనే గ్యారెంటీ లేదని అన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ముస్లింలకు 4 శాతం కేవలం విద్య, ఉద్యోగాల్లో
మాత్రమే రిజర్వేషన్లు కల్పించగా వారు స్థానిక సంస్థల్లో 4 శాతం కాకుండా మొత్తం 34 శాతంలో పోటీ చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం కాపులకు కేవలం విద్య, ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం నూరుశాతం బీసీలను మోసగించడమేనన్నారు. విజయవాడలో ఈనెల 7న బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి విస్తృత సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వైకె, కె క్రాంతికుమార్, ఆదిశేషు, కన్న మాస్టారు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..గుంటూరు కలెక్టరేట్ ఎదుట బీసీ నాయకుల ధర్నా