రాష్ట్రీయం

కోటా 50 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: పంచాయతీరాజ్ చట్టం సమూల మార్పులు, సంస్కరణలు ప్రవేశపెట్టడానికి త్వరలో శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానున్న నేపథ్యంలో స్థానిక సంస్థలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ ప్రజా ప్రతినిధుల కమిటీ ప్రతిపాదించింది. బీసీలు రాజకీయంగా ఎదగడానికి స్థానిక సంస్థల్లో ప్రస్తుతం కేటాయించిన 34 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని సూచించింది. బీసీల సంక్షేమం- అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజా ప్రతినిధులు చేసే ప్రతిపాదనలను యథాతథంగా అమలు చేస్తామని సీఎం కె చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీసీల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి మూడు రోజులుగా బీసీ ప్రజాప్రతినిధులు చేసిన కసరత్తు మంగళవారం ముగిసింది. తమ సిఫారుసులను రెండు రోజుల్లో సీఎంకు అందజేయనున్నట్టు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మీడియాకు వెల్లడించారు. శాసనసభ కమిటీ హాలులో జరిగిన బీసీ ప్రజాప్రతినిధుల సమావేశానికి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో పాటు అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై పలు సూచనలు, సలహాలను అందించారు. ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలపై కమిటీ విస్తృతంగా చర్చించింది. వీటిని క్రోడీకరించిన అనంతరం రెండు రోజుల్లో ముఖ్యమంత్రికి నివేదిక అందజేయనున్నట్టు మంత్రి ఈటల వెల్లడించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఇప్పటికే శాసనసభ చేసిన తీర్మానాన్ని ఉటంకిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయడానికి త్వరలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరుతామన్నారు. బీసీ కాంట్రాక్టర్లను ప్రోత్సహించడానికి బిక్కీ ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టుల్లో ఇఎండి లేకుండా వెసులుబాటు కల్పించాలని ప్రతిపాదించినట్టు ఈటల తెలిపారు.
అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇన్స్యూరెన్స్ స్కీమ్ బీసీలందరికీ అమలు చేయాలని, కుల వృత్తుల ప్రోత్సాహానికి అధునిక విధానాలు అమలుకు రీసెర్చ సెంటర్లు ఏర్పాటు చేయాలని, గ్రూప్-1, సివిల్స్ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీసీలకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశామన్నారు. సంచార జాతుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందజేయాలని ప్రతిపాదించామన్నారు. తెలంగాణ కొత్త రాష్టమ్రైనప్పటికీ సంక్షేమ రంగంలో దేశానికే అదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి ఈటల కొనియాడారు. అణగారిన వర్గాల తలరాతలు మార్చడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై మూడు రోజుల కసరత్తు ఫలవంతంగా ముగిసిందన్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఉన్నత విద్యకు బీసీ వర్గాలు ఇప్పటికీ దూరంగానే ఉన్నాయన్నారు. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా రాణించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నట్టు మంత్రి జోగురామన్న తెలిపారు.