రాష్ట్రీయం

భరోసా కేంద్రంలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: తెలంగాణలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్, నేరాల అదుపులో ఫ్రెండ్లీ పోలీసింగ్ విజయవంతం కావడంతో పోలీస్ శాఖ క్రైమ్స్ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈమేరకు స్పెషల్ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర హైకోర్టు కూడా అనుమతిచ్చిందని అదనపు కమిషనర్ క్రైమ్స్ అండ్ సిట్ చీఫ్ స్వాతిలక్రా వెల్లడించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది మే 7న మహిళల భద్రత, బాలల సంక్షేమం కోసం ప్రారంభించిన భరోసా సత్ఫలితాలిచ్చిందన్నారు. అత్యాచార బాధితులు, గృహ హింస బాధితులు, లైంగిక వేధింపులు, దాడులకు గురైన బాలలకు భరోసా అండగా నిలిచిందన్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు 2012 పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. భరోసా ప్రారంభించిన నాటినుంచి 2900 కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. ఈ భరోసా కేంద్రం ద్వారా న్యాయ సలహాలు, వైద్య పరీక్షలు, పునరావాసం, పరిహారం వంటి వాటికి తగు సలహాలు ఇస్తూ సమస్యల పరిష్కారానికి కృషి
చేస్తుందన్నారు. భరోసా కేంద్రంలో నిర్వహించతలపెట్టిన స్పెషల్ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ద్వారా బాధితులు కోర్టులో హాజరుకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా వాంగ్మూలాలు ఇచ్చే సౌకర్యం ఉందని తెలిపారు. భరోసా కేంద్రంలో కౌనె్సలింగ్, క్లినికల్ సైకాలజిస్ట్స్, అడ్వొకేటు, మహిళా పోలీస్ అధికారులు, వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని స్వాతిలక్రా తెలిపారు. భరోసా ఆధ్వర్యంలో నిర్వహించే ఇలాంటి కేంద్రం దేశంలోనే మొదటిదన్నారు.

చిత్రం..మీడియాకు చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు వివరాలు వెల్లడిస్తున్న
అదనపు కమిషనర్ స్వాతిలక్రా