రాష్ట్రీయం

వారంలోగా సమాధానం చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పండ్ల వర్తకులు పండ్లను కృత్రిమ పద్ధతిలో కాల్షియం కార్బైడ్ రసాయనం ఉపయోగించి మగ్గపెట్టడాన్ని నిరోధించడానికి తనిఖీలను నిర్వహించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై రెండు రాష్ట్రప్రభుత్వాలు వారం రోజుల్లోగా అఫిడవిట్‌లను దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జి శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పత్రికల్లో వచ్చిన వార్తలను విచారణ నిమిత్తం స్వీకరించి ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆహార భద్రత విభాగంలో భర్తీలను ఖాళీ చేయకపోవడం వచ్చే సోమవారం హాజరై వివరణ ఇవ్వాలని సంబంధిత విభాగం అధికారులను కోర్టు ఆదేశించింది. ఆంధ్రాలో 20 మంద ఫుడ్ సేఫ్టీ అధికారులు, తెలంగాణలో 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారని హైకోర్టుకు అమికస్ క్యూరీ కోర్టుకు తెలిపారు.
తిరుమల స్టాల్స్, హోటళ్లను తనిఖీ చేయకపోవడంపై చిత్తూరు పన్నుల శాఖ పట్ల హైకోర్టు ఆగ్రహం తిరుమలలో హోటళ్లు, స్టాల్స్‌ను తనిఖీ చేసి వారి అకౌంట్స్‌ను ఆడిట్ చేయకపోవడంపై చిత్తూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ తీరు పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.