రాష్ట్రీయం

నేటి నుండి పవన్ పరామర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన పలు దుర్ఘటనల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఈ నెల 6వ తేదీ నుండి పర్యటించనున్నారు. ఆరో తేదీ ఉదయం 8.30కి విశాఖ చేరుకుని అక్కడి నుండి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాల యం వద్దకు వెళ్లి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. డిసిఐ ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరం వద్దకు వెళ్లి ఉద్యోగులతో మాట్లాడతారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడతారు. సాయంత్రం జనసైనికుల సమావేశంలో పాల్గొంటారు. ఏడో తేదీ ఉదయం రాజమండ్రి చేరుకుని అక్కడ జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లి ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం విజయవాడ వెళ్తారు. 8వ తేదీ ఉదయం విజయవాడలో ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్ధులు, తల్లిదండ్రులతో సమావేశమవుతారు. కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు అధ్యాపకులతో మాట్లాడతారు. అనంతరం జనసైనికుల సమావేశంలో పాల్గొంటారు. సాయం త్రం మీడియాతో ముచ్చటిస్తారు. 9 వ తేదీ ఉద యం మంగళగిరిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్న స్థలాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుండి ఒంగోలు వెళ్తారు. కృష్ణానది పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ మూడువిడతలుగా పర్యటిస్తారు. ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నపుడు విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఒక విద్యార్థి వేసిన ప్రశ్న తనను కలచివేసిందని పవన్ పేర్కొన్నారు.