రాష్ట్రీయం

రైళ్ళ నుంచి రోడ్డు మార్గంలోకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 5: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల నుంచి నిషేధిత గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేసేందుకు ఖమ్మం నగరం కీలకంగా మారింది. ఆ ప్రాంతాల నుంచి హైదరాబాద్, మహారాష్టత్రో పాటు ఉత్తర భారత దేశానికి గంజాయిని సరఫరా చేయాలంటే ఖమ్మం నగరం మీదుగానే వెళ్ళాల్సి ఉంది. రైలు మార్గమైనా, రోడ్డు మార్గమైనా ఖమ్మం మీదుగానే వెళతారు. దీంతో గంజాయి సరఫరాలు అడ్డుకునేందుకు ఖమ్మం పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి. రెండునెలల క్రితం వరకు రైలు మార్గంద్వారా గంజాయిని సరఫరా చేస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేసి కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా భువనేశ్వర్ నుంచి ముంబాయి వెళ్ళే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను అక్రమ సరఫరాదారులు వేదికగా చేసుకోవడంతో పోలీసులు అనేకమార్లు దాడులు చేసి గంజాయి పట్టుకున్నారు. చివరకు రైలు మార్గాలను వదిలేసి రోడ్డుమార్గాన్ని ఎంచుకోవడంతో దానిపై కూడా పోలీసులు నిఘాపెట్టారు. తాజాగా మంగళవారం ఖమ్మం జిల్లా పోలీసులు కోటి రూపాయలకు పైగా విలువైన 500 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీంతో రోడ్డుమార్గమైనా, రైలు మార్గమైనా ఖమ్మం కీలకంగా మారింది. కాగా పోలీసులు అనేక మార్లు గంజాయి సరఫరాదారులను పట్టుకున్నప్పటికీ దానిని క్షేత్రస్థాయిలో అమ్మేవారి విషయాలు కాని, కొనుగోలుదారుల విషయాలు కాని సేకరించటం లేదు.
మహారాష్టల్రోని పలు ప్రాంతాలకు గంజాయి వెళ్తున్నా అది ఎక్కడికి వెళ్తున్నదనే విషయం బయటకు రావడంలేదు. అలాగే పోలీసులు పట్టుకున్న నిందితులు గంజాయిని ఎక్కడి నుంచి తీసుకువస్తున్న విషయం తెలిపినా అక్కడ దాడులు జరిపి దానిని తుదముట్టించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకమైన ప్యాకింగ్‌ల ద్వారా గతంలో ట్రాన్స్‌పోర్టుల ద్వారా వెళ్ళేటటువంటి గంజాయి ఇప్పుడు రూటు మారి ప్రధాన మార్గాల గుండానే వెళ్తున్నది. క్షేత్రస్థాయిలో తుదముట్టించగలిగితే ఈ సరఫరానే ఉండదనే వాదన వస్తోంది. గడిచిన ఏడాది కాలంలోనే ఖమ్మంలో పట్టుకున్న గంజాయి విలువ కోట్లలో ఉండటం గమనార్హం.