రాష్ట్రీయం

చిక్కుల్లో చంద్రులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 5: ‘ముస్లిం మైనారిటీలకు 4 నుంచి 12 శాతం పెంచుతూ చేసిన తీర్మానం ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి చేస్తాం. 9వ షెడ్యూల్‌లో చేర్పించేందుకు అవసరమైతే పోరాడతాం. ప్రధాని కూడా నాకు హామీ ఇచ్చారు’ - ముస్లింలకు రిజర్వేషన్లు ఆమోదించిన సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఇచ్చిన మాట ప్రకారం కాపు వర్గాలకు 5 శాతం రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్రానికి పంపుతాం. దానిని 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు అందరం కృషి చేద్దాం’ - గత వారం అసెంబ్లీ సమావేశాల్లో కాపు రిజర్వేషన్ల తీర్మానం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ‘సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు? రిజర్వేషన్లు 50 శాతానికి దాటకూడదన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని విస్మరించి కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలిస్తోంది’- తాజా గుజరాత్ ఎన్నికల ప్రచారసభలో ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్రమోదీ రిజర్వేషన్లపై చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రాజకీయంగా చిక్కుల్లో పడినట్లయింది. తెలంగాణలో 4 శాతం ఉన్న ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఏపీలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతూ వాటిని సుప్రీంకోర్టు సమీక్షించేందుకు వీలులేని, 9వ షెడ్యూల్‌లో చేర్చాలంటూ బంతిని బీజేపీ కోర్టులో నెట్టాయి. తాము ఇచ్చిన మాట ప్రకారం ముస్లిం, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినందున, ఇక దానిని ఆమోదించి చట్టం చేయాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని చంద్రబాబు, చంద్రశేఖర్‌రావు ప్రభుత్వాలు నేర్పుగా, సాంకేతికంగా రిజర్వేషన్ బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టడం ద్వారా, రక్షణాత్మక వ్యూహం అనుసరించారు. ఇకపై వాటికి సంబంధించి ఏ డిమాండ్లు వచ్చినా నెపం బీజేపీ వైపు నెట్టే ముందస్తు ప్రణాళిక రచించారు. ఒకవేళ ఆ రెండు రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదముద్ర వేయకపోతే, ముస్లింలు, కాపుల కోసం తాము అంకితభావంతో తీర్మానం చేసి పంపితే బీజేపీ దానిని ఖాతరు చేయనందున తాము నిస్సహాయులమని, వచ్చే ఎన్నికల్లో తమకు అన్ని పార్లమెంటు స్థానాలు కట్టబెడితే, తమ బలం ఉపయోగించి వాటికి ఆమోదముద్ర వేయిస్తామని చెప్పే తిరుగులేని ముందస్తు రాజకీయవ్యూహానికి తెరలేపారు. అయితే, మోదీ వారి ఆశలపై నీళ్లు చల్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. ప్రధాని మోదీ రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించడంతోపాటు, కాంగ్రెస్ రిజర్వేషన్ రాజకీయాలు చేస్తోందని విరుచుకుపడ్డారు. దానితోపాటు, 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఎలా పెంచుతారని ప్రశ్నించడం ద్వారా, బాబును, కేసీఆర్‌నూ పరోక్షంగా ఇరుకున పెట్టడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామాలకు తెరలేచినట్టయింది. దీన్నిబట్టి, కేసీఆర్ ప్రతిపాదించిన ముస్లిం రిజర్వేషన్, బాబు ప్రతిపాదిత కాపు రిజర్వేషన్ గానీ 9వ షెడ్యూల్‌లో చేర్చే సమస్యే లేదన్న విషయం స్పష్టమయిపోయింది. మోదీ తెలుగు రాష్ట్రాలు పెంచిన రిజర్వేషన్ల గురించి నేరుగా మాట్లాడకపోయినప్పటికీ, విధానపరంగానే మాట్లాడినందున అది ఇద్దరు చంద్రులకూ రాజకీయంగా ఇబ్బందికర పరిణామమేనంటున్నారు. దీనిపై రెండు రాష్ట్రాల్లోని అధికారపార్టీ, ప్రత్యర్థిపార్టీలతోపాటు, రిజర్వేషన్లు పొందుతామన్న ఆశతో ఉన్న వర్గాల నుంచి వ్యతిరేకత, ఒత్తిళ్లకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కేంద్రంలో భాగస్వామి కానందున ఆ పార్టీకి వచ్చే నష్టం పెద్దగా లేకపోయినా, కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకే ఈ అంశం ఇబ్బందికరంగా మారవచ్చని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. కాకపోతే తెలంగాణలో కేసీఆర్ ప్రత్యర్థులు.. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా కేసీఆర్ ప్రభుత్వం ముస్లిం ఓట్ల కోసం, వారిని మోసగించారని విరుచుకుపడే అవకాశాలున్నాయంటున్నాయి.
ఇకపై కాపుసంఘాలు తమకు ఇచ్చిన రిజర్వేషన్‌ను 9వ షెడ్యూల్‌లో చేర్చకపోతే, ఎన్డీఏ నుంచి వైదొలుగుతామని కేంద్రాన్ని హెచ్చరించాలని డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదు. తమపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని, టీడీపీని వ్యతిరేకించే కాపు నేతలు ఇకపై డిమాండ్ చేసి, రాజకీయంగా బాబు సర్కారును ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఆ రకంగా రిజర్వేషన్ బంతిని తొలుత ఇద్దరు చంద్రులు నేర్పుగా బీజేపీ కోర్టుకు నెడితే, మోదీ మరింత వ్యూహాత్మకంగా తిరిగి వారి కోర్టుకే నెట్టి, ఇద్దరినీ ఇరికించినట్లు స్పష్టమవుతోందని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు.