రాష్ట్రీయం

ఎన్‌డీకి ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 7: తెలంగాణలో తీవ్ర నిర్బంధంతో సతమతమవుతున్న న్యూడెమక్రసీ (ఎన్‌డీ) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఏరియా దళ కమాండర్, ఎన్‌డీ రాష్ట్ర నాయకుడు లింగన్నను గురువారం ఖమ్మం సమీపంలోని రఘునాథపాలెంలో పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం ఖమ్మం వెళ్లి తిరిగి వస్తుండగా పక్కా సమాచారంతో నిరాయుధుడైన లింగన్నను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. గుండాల మండలం రోడ్లగడ్డ గ్రామానికి చెందిన పూనెం లింగయ్య అలియాస్ లింగన్న 1997లో న్యూడెమక్రసీ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి అజ్ఞాత దళాల ఏరియా కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా పని చేస్తున్నాడు. లింగన్న అరెస్టుతో గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాల్లో న్యూడెమక్రసీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన లింగన్నను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు.
కాగా దళ కమాండర్ లింగన్నను వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఎన్‌డీ జిల్లా నాయకులు మాచర్ల సత్యం డిమాండ్ చేశారు.

లింగన్న ఫైల్‌పొటో