రాష్ట్రీయం

రూ.142.34 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబం ఆస్తులను శుక్రవారం రాష్ట్ర ఐటి మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. సీఎం కుటుంబ సభ్యులకు రూ.142.34 కోట్లమేర ఆస్తులు ఉండగా, రూ. 70.5 కోట్లమేర ఆప్పులు ఉన్నాయి. దీంతో నికర ఆస్తుల విలువ 75.06 కోట్లు అని మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న నికర ఆస్తుల విలువ రూ. 2.53 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను మీడియా సమావేశంలో ప్రకటించారు. సీఎంకు హైదరాబాద్‌లో ఉన్న ఇంటికోసం నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. గత ఏడాదికన్నా బ్యాంక్‌లో రూ. 37 లక్షల నగదు నిల్వ పెరగి రూ. 40 లక్షల రూపాయలైంది. ఇల్లు కోసం తీసుకున్న రుణంతో గత ఏడాదికంటే అప్పు 3.58 కోట్లు పెరిగింది. దీంతో అప్పుల విలువ రూ. 5.64 కోట్లకు చేరింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే, పెద్దగా సీఎం ఆస్తుల వివరాల్లో మార్పు లేదన్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి నికర ఆస్తుల వివరాలు రూ. 25.41 కోట్ల రూపాయలని తెలిపారు. గత ఏడాది కన్నా అప్పులు 5 కోట్ల రూపాయల మేర పెరిగాయన్నారు. తన ఆస్తుల నికర విలువ 15.21 కోట్ల రూపాయలని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఇంటి కోసం రూ. 6.5 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని తెలిపారు. ఇంటికోసం రూ. 3.58 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నానని చెప్పారు. తన భార్య బ్రాహ్మణి నికర ఆస్తుల విలువ రూ. 15.01 కోట్ల రూపాయలని తెలిపారు. తన కుమారుడు దేవాన్ష్ నికర ఆస్తుల విలువ 11.54 కోట్ల రూపాయలన్నారు. తమ కుటుంబానికి చెందిన నిర్వాణ హోల్డింగ్స్‌కు 5.36 కోట్ల రూపాయల మేర నికర ఆస్తులున్నాయన్నారు. గత ఏడు సంవత్సరాలుగా తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు వెల్లడిస్తున్నానని తెలిపారు. అసెంబ్లీలోనూ ఈ వివరాలు అందచేస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ నేత తమ కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించిన
దాఖలాలు లేవన్నారు. తమ శాసన సభ్యులను కూడా వివరాలు ప్రకటించాలని కోరుతున్నామని తెలిపారు. తమపై అసత్య ఆరోపణలు చేసే ప్రతిపక్ష నేత జగన్ ముందుగా తన ఆస్తుల వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాదీ ఈ చాలెంజ్ చేస్తున్నా స్పందించడం లేదన్నారు. ఆయన ఆస్తుల వివరాలను సీబీఐ, ఈడీ వెల్లడిస్తుంటే తెలుసుకుంటున్నామని చలోక్తి విసిరారు. ఒక పద్ధతిగా పాలు, కూరగాయలు అమ్ముతూ ఈ ఆస్తులు సంపాదించామని, ఇతర వ్యాపారాలు తమకు లేవన్నారు. కొన్ని ఆస్తులపై అద్దెలు వస్తున్నాయన్నారు. రాజకీయాల మీద ఆధార పడవద్దని, వ్యాపారం చేసి సంపాదించి, సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడాలని తమ నాన్నచెబుతుంటారని గుర్తు చేశారు. జగన్ తన తండ్రి వైఎస్ పదవిని అడ్డుపెట్టుకుని సంపాదించిన మాదిరిగా సంపాదించిన ఆస్తులు కావన్నారు.
భారీగా బంగారు ఆభరణాలు
భువనేశ్వరి వద్ద విలువైన రాళ్లతో కూడిన 3519 గ్రాముల బంగారు ఆభరణాలు, 32.7 కిలోల వెండి ఆభరణాలు ఉండగా, బ్రాహ్మిణి వద్ద 310 క్యారెట్ల విలువైన 2325 గ్రాముల బంగారు ఆభరణాలు, 97.441 కిలోల వెండి ఆభరాణాలు ఉన్నాయని ప్రకటించారు. దేవాన్ష్‌కు 2.87 లక్షల విలువ చేసే వెండి ఊయల ఉన్నట్లు ప్రకటించారు.
చంద్రబాబు ఆస్తులు 8.17 కోట్లు!
సేవింగ్స్ ఖాతాలో రూ.40 లక్షలు.. అప్పులు 5.64 కోట్లు
భువనేశ్వరి ఆస్తులు రూ. 46.31 కోట్లు
సేవింగ్స్ ఖాతాలో రూ. 6.4 లక్షలు.. అప్పులు రూ.20.90 కోట్లు
లోకేశ్ ఆస్తులు రూ.26.39 కోట్లు
సేవింగ్స్ ఖాతాలో రూ. 1.84 లక్షలు.. అప్పులు రూ. 11.17 కోట్లు
బ్రాహ్మిణి ఆస్తులు రూ. 15.37 కోట్లు
సేవింగ్స్ ఖాతాలో రూ. 46 లక్షలు.. అప్పులు రూ. 3.6 కోట్లు
దేవాన్ష్ ఆస్తులు రూ. 11.54 కోట్లు
భవనేశ్వరికి 3.519 కిలోల బంగారం, 32.7 కిలోల వెండి
బ్రాహ్మణికి 2.325 కిలోల బంగారం, 97.4 కిలోల వెండి
దేవాన్ష్‌కు 2.87 లక్షల విలువ చేసే వెండి ఊయల
*
చిత్రం..కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటిస్తున్న మంత్రి లోకేశ్
*
ఆస్తుల అప్పుల లెక్కలు
మస్తుగ ప్రకటించినారు మన లోకేశుల్
వాస్తవ, మార్కెట్ విలువల
కుస్తీలో అంకెలన్ని కురచైపోయెన్!
*