రాష్ట్రీయం

పట్టిసీమపై పేచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణాబేసిన్‌లోని ప్రకాశం బ్యారేజీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్ధాయిలో అభ్యంతరం తెలిపింది. ఈ అంశంపై తాము సంపూర్ణ నివేదిక ఇవ్వనున్నట్లు గోదావరి బోర్డుకు తెలంగాణ స్పష్టం చేసింది. దీనికి గోదావరి బోర్డు సమ్మతిని తెలిపింది. కాగా ఆంద్రప్రభుత్వం మాత్రం నీటి కేటాయింపులను ఖరారు చేసే అధికారం గోదావరి బోర్డుకు లేదని కరాఖండిగా తెలిపింది. దీంతో ఆంధ్ర, తెలంగాణ ఇంజనీర్ల మధ్య కొద్ది సేపు చర్చ జరిగింది. మంగళవారం ఇక్కడ జలసౌధలో గోదావరి జలాల యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్‌లు హాజరయ్యారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణాబేసిన్‌కు తరలించడంపై మొదటి నుంచి తెలంగాణ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. వంద టిఎంసి నీటిని ఆంధ్ర ప్రభుత్వం తరలిస్తోందని తెలంగాణ వాదించింది. ఈ మేరకు తమకు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అదనపు జలాలను వాడకునే హక్కును కల్పించాలని తెలంగాణ కోరుతోంది. తెలంగాణ ప్రాంతానికి వాటాను కల్పించాలని ఆ రాష్ట్ర ఇంజనీర్లు మంగళవారం బోర్డును కోరారు. దీనికి ఆంధ్ర వ్యతిరేకించగా, ఇక బోర్డును ఎందుకు ఏర్పాటు చేశారని,వివాదాలు పరిష్కరించడానికి బోర్డును కేంద్రం నియమించిందని తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి తెలిపారు. వంద టిఎంసి కంటే ఎక్కువ నీటిని గోదావరి నుంచి కృష్ణాబేసిన్‌కు మళ్లిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గోదావరి బోర్డు చైర్మన్ సాహు జోక్యం చేసుకుని నీటి వినియోగంపై తమకు నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్నికోరారు. గోదావరి నదిపై ఇరు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను సమర్పించాలని ఆయన ఆదేశించారు. గోదావరి నదిపై నీటిని మళ్లించే ప్రదేశాల వద్ద టెలిమెట్రీని ఏర్పాటు చేస్తామని బోర్డు కార్యదర్శి సమీర్ చటర్జీ తెలిపారు. దీని వల్ల ఏ మేరకు నీటి వినియోగంజరుగుతుందో తెలుస్తుందని ఆయన చెప్పారు. ఓడిశా ప్రభుత్వం నిర్మించే మిడిల్ కొలాబ్ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాలు 15 రోజుల్లోగా తమ నివేదికలను ఇవ్వాలని బోర్డు కోరింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో బోర్డు నిర్వహణకు సంబంధించి రూ.7.50 కోట్ల నిధులను భరించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి.