రాష్ట్రీయం

ఇక ఇళ్లకే సరుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 12: రేషన్ షాపు డీలర్లకు అధిక ఆదాయం, వినియోగదారులకు సరసమైన ధరలకే వస్తువులు లభించేలా ‘చంద్రన్న విలేజ్ మాల్స్’కు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రేషన్ షాపు డీలర్లు, వినియోగదారులకు వీటిని నూతన సంవత్సర కానుకగా అందిస్తున్నామని అన్నారు. విజయవాడ, గుంటూరులో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ‘చంద్రన్న విలేజ్ మాల్’ను మంగళవారం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించారు. పేదవారికి నాణ్యమైన వస్తువులను, అత్యంత చౌక ధరలకు అందించాలనే లక్ష్యంతో ‘చంద్రన్న విలేజ్ మాల్’లు రాష్టమ్రంతటా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 28వేలకు పైగా ఉన్న చౌకధరల దుకాణాలను ‘చంద్రన్న విలేజ్ మాల్’గా నవీకరిస్తున్నామని, మొదటి దశలో 6,500 రేషన్ షాపులు అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పేదలకు ప్రభుత్వం అందించే బియ్యం బదులుగా అంతే విలువకు కావాల్సిన వస్తువులు లబ్ధిదారులకు ఇస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ‘చంద్రన్న విలేజ్ మాల్’కు అవసరమైన వస్తువుల సరఫరాకు మండలం, నియోజకవర్గం స్థాయిలో డిపోలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. నిత్యావసర వస్తువులతో పాటు, గృహోపకరణాలు, కిరాణా సరుకులు, సౌందర్య సాధనాలను మాల్‌లో విక్రయిస్తారని అన్నారు. వివిధ బ్రాండ్లకు చెందిన 500కు పైగా ఉత్పత్తులు ఎంఆర్‌పీ కన్నా 4శాతం నుంచి 35 శాతం తక్కువ ధరకు లభిస్తాయని వెల్లడించారు. మాల్‌లో విక్రయించే వస్తువులపై వివిధ సంస్థలు ఇచ్చే డిస్కౌంట్‌లో 40 శాతం డీలర్‌కు, 60 శాతం వినియోగదారులకు దక్కుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ‘చంద్రన్న విలేజ్ మాల్’ నవీకరణకు అయ్యే పెట్టుబడి వ్యయాన్ని ‘పీఎం ముద్ర యోజన’ పథకం ద్వారా రేషన్ షాపు డీలర్లకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. డీలర్లు శ్రమ పడకుండా, సమయం ఆదా చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో తమ మాల్‌కు కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే సర్వీస్ చార్జీ అదనంగా తీసుకుని వినియోగదారుల ఇంటి దగ్గరకే కోరినవాళ్లకు సరుకులు డెలివరీ చేయొచ్చని డీలర్లకు సూచించారు. డ్వాక్రా, మెప్మా, జీసీసీ ఉత్పత్తులతోపాటు ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే వివిధ వ్యవసాయ ఉత్పత్తులను ఈ మాల్‌లో అందుబాటులోకి తెస్తామని అన్నారు. బందరు లడ్డు, కాకినాడ కాజా, పచ్చళ్లు ఇలా తెలుగింటి రుచులు అన్నింటినీ విక్రయించుకోవచ్చని చెప్పారు. వినియోగదారులతో మర్యాదగా నడుచుకోవాలని రేషన్ షాపు డీలర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. కనీసం 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో
మాల్‌ను ఏర్పాటుచేసి పరిశుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. నాణ్యమైన వస్తువులు అమ్మడమే కాకుండా, వస్తువులు కాలపరిమితి దాటకుండా చూసుకోవాలని చెప్పారు.

చిత్రం..చంద్రన్న విలేజ్‌మాల్ బ్రోచర్ ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు