రాష్ట్రీయం

పోలవరం బాధ్యత ప్రధానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీతో భేటీ కానున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు సమావేశమై చర్చించుకోవాలంటూ ఒడిశా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన, ప్రాజెక్టుకు
నిధుల కేటాయింపు, అనుమతుల మంజూరు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే మంగళవారం రాత్రి గడ్కరీతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీం కోర్టుకు కొన్ని అభ్యంతరాలతో ఒడిశా ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై ఆ ప్రభుత్వానికి సుప్రీం చేసిన కొన్ని సూచనలు విభాగాధిపతులతో మంగళవారం సీఎం చంద్రబాబు జరిపిన సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఏపీ ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాలని సుప్రీం సూచించినట్లు అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో ఇదో కొత్త ట్విస్టు అంటూ సీఎం వ్యాఖ్యానించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రధానిదేనని తెలిపారు. తాను ఇప్పటికే ఒడిశా సీఎంతో మాట్లాడానని, రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఒడిశా సీఎం పోలవరం విషయంలో అభ్యంతరాలు లేవనెత్తుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ సీఎంతో కూడా మాట్లాడానని, ప్రస్తుతం ఆయన వౌనంగా ఉన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రధాని ఏర్పాటు చేస్తే మంచిదేనన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర వైఖరిపై ఇటీవల సీఎం కొంత దూకుడు పెంచారు. ప్రాజెక్టును అడ్డుకుంటే సహించబోమని, ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేయడం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు, ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం, సవరించిన అంచనాలకు ఆమోదం, కొత్తగా కొన్ని పనులకు టెండర్లు వంటి అంశాలను పరిశీలించేందుకు ఈ నెల 22న గడ్కరీ రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో గడ్కరీతో సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.