రాష్ట్రీయం

హామీలు పట్టని బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 12: ఎన్నికల సమయంలో ఇష్టమొచ్చినట్లు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని మరచి కొంగలా దొంగ జపం చేస్తూ మాయమాటలతో ప్రజలను వంచించారని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. చెరువులోని చేపలను తిన్న కొంగ కథ మారిది ఆయన రాష్ట్రంలోని ఏ వర్గాన్నీ వదిలిపెట్టకుండా తినేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రజా సంకల్పయాత్ర 33వ రోజు అనంతపురం నగరం కళ్యాణదుర్గం రోడ్డులోని రాజ హోటల్ వద్ద ఏర్పాటుచేసిన సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డారు. ఈ పాలన ఎపుడెపుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. చెరువులోని చేపలు.. కొంగ దొంగ జపం కథను ప్రస్తావిస్తూ చంద్రబాబు పాలనను పోల్చారు. ‘అనగనగా ఓ చెరువు ఉండేది.. దాంట్లో చాలా చేపలుండేవి... ఆహారం కోసం రోజూ ఓ కొంగ చెరువు వద్దకు వచ్చేది. చెరువులోని చేపల్ని కడుపునిండా ఆరగించేది.. రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబులాగా... కాలం
గడిచే కొద్దీ ఆ కొంగకు వయసు అయిపోయింది.. అపుడు నాకు ఆహారం ఎలా.. నేను వేటాడలేను కదా.. అని ఆలోచనలో పడింది.. అధికారం కోసం మన చంద్రబాబు మాదిరిగా... వెంటనే ఆ కొంగ ఓ ఎత్తు వేసింది. ఓ రోజు చేపలకు ఇలా చెప్పింది... నాకు వయసు అయిపోయింది.. ఇకపై మిమ్మల్ని ఎవర్నీ తినను.. నాకు పళ్లు కూడా లేవు.. ఇక నుంచి తాను సాధు జీవిగా ఉంటానని చెప్పింది. నిజమే కదా అని చేపలు నమ్మాయి. అప్పటి నుంచి కొంగ చెరువులోకి వెళ్లి నీళ్లలో దొంగ జపం మొదలు పెట్టింది... కొంగ మారిపోయింది.. ఇక మనల్ని తినదు అని చేపలు దాంతో ఫ్రెండ్లీగా ఉండటం మొదలు పెట్టాయి.. కొద్ది రోజుల తర్వాత ఆ కొంగ చేపలతో ఇలా అంది... మరికొన్ని రోజుల్లో చేపలు పట్టేవారు వస్తారని, వలలు వేసి మిమ్మల్ని పట్టుకుపోతారు అని భయపెట్టింది...దీంతో చేపలన్నీ ప్రాణాలు దక్కించుకునే ఉపాయం చెప్పమని కొంగను కోరాయి...దీంతో కొంగ కళ్లు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నట్లు నటించి.. కొద్దిసేపటి తర్వాత.. ఇక్కడికి దగ్గర్లోనే ఓ పెద్దచెరువు ఉంది.. అక్కడికి వెళ్తే ప్రాణాలు దక్కించుకోవచ్చు అంటూ నమ్మబలికింది...దీనికి సమ్మతించిన చేపలు అయితే అక్కడికి ఎలావెళ్లాలి అని ప్రశ్నించాయి. రోజుకు కొన్ని చొప్పున ముక్కున కరచుకుని తీసుకువెళ్లి పెద్ద చెరువులో వదులుతాను అని చెప్పింది.. మన చంద్రబాబు.. మనల్ని నమ్మించినట్లు. చేపలన్నీ కొంగ మాట నమ్మాయి... అలా ఆ కొంగ రోజూ కొన్ని చేపల్ని తీసుకువెళ్లి చెరువు ఒడ్డున ఉన్న పెద్ద బండరాయిపై కూర్చుని వాటిని తీరిగ్గా ఆరగించేది. ఇప్పుడు మన సీఎం చంద్రబాబు కూడా ఆ దొంగ కొంగలాగే రాష్ట్రాన్ని తినేస్తున్నారని కథ ముగించారు. పొదుపు సంఘాల అక్కచెల్లెళ్లను తినేస్తున్నారు... రుణమాఫీ చేస్తామంటూ రైతుల్ని తినేస్తున్నారు... ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల్నీ తినేస్తున్నారు... ఇలా ఒకటేమిటి ఏవర్గాన్నీ వదిలిపెట్టడం లేదు అని జగన్ ధ్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా తనను కలిసిన పలువురు విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ‘నీటిలోని కొంగ.. చంద్రబాబు దొంగ’ అంటూ బాబు పాలన గురించి వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు.
అనంతపురం జిల్లాలో టీడీపీ వారు ప్రత్యర్థుల్ని మట్టుబెడుతున్నారని జగన్ ఆరోపించారు. హత్యా రాజకీయాలతో టీడీపీ వారు అటు ఇతర పార్టీల నాయకులను, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దవడుగూరు, రాప్తాడులో ప్రభుత్వ కార్యాలయాల్లో వైకాపా నేతల్ని హతమార్చారన్నారు. తాజాగా వైకాపా బీసీ విభాగం నేత ధనుంజయయాదవ్‌ను హతమార్చడానికి కుట్ర పన్నారన్నారు. దీన్ని బట్టే రాష్ట్రంలో ఎంతటి దుష్టపాలన సాగుతోందో అర్థమవుతోందని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మోహన్‌రెడ్డి, గంగుల భానుమతి, లక్ష్మీపార్వతి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులో జరిగిన సభలో ప్రసంగిస్తున్న జగన్