రాష్ట్రీయం

కథా రచయిత ఇచ్ఛాపురం కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, డిసెంబర్ 14: రచయితలకు అభిమానులుండటం సహజమే..కానీ రచయితకు తోటి రచయితలనే అభిమానులు చేసుకున్న రచన శైలీ ఇచ్ఛాపురం జగన్నాథరావుకే సొంతం. ఇపుడు ఆ కలం మూగబోయింది. 86 ఏళ్ల వయస్సు కల్గిన ఇచ్చాపురం జగన్నాథరావు సాహితీలోకానికి ఐ.జె.రావుగా సుపరిచితులు. ఈ నెల 13న బంజారాహిల్స్‌లోని తన నివాసంలో సాయంత్రం కూర్చీ కూర్చోని సెల్‌ఫోన్ చూస్తూ వెనక్కి ఒరిగారు. ఒక్కసారిగా గుండెపోటు రావటంతో తుది శ్వాస వదిలారు. ఆయన పార్దివ దేహానికి గచ్చిబౌలీలోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్‌లో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ తరుచూ దేశంలోని వివిధ రాష్ట్రంలో పర్యటించే ఇచ్చాపురం తానెంత బిజీగా ఉన్నా, కథానిక రచనపై తనకున్న మక్కువను ఏ మాత్రం తగ్గనివ్వలేదు. ఎన్నో కథానికలను రచించి కథనిక రచన
రంగంలో పేరుగాంచిన డా.వేదగిరి రాంబాబు, విహారి, వి.రాజ రామ్మోహన్, చంద్రశేఖర్ ఆజాద్, వాణీశ్రీ వంటి రచయితలను తన అభిమానులుగా మల్చుకున్నారు ఇచ్చాపురం. ఆయన మరణవార్త వినగానే కథానిక రచయితలు నిర్ఘాంతపోయారు. ఈ మేరకు రచయితలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన కథానికకు బాపూ కితాబు
బాపూ మెచ్చుకునే స్థాయిలో ఇచ్చాపురం జగన్నాధరావు కథానికలను రచించారని కథానిక రచయిత డా.వేదగిరి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆయన కథానికకు బొమ్మ వేయమని, తాను ఆ కథానికను బాపూకి ఇచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తిరిగి బాపూయే వేదగిరి రాంబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఓ చక్కటి కథానిక చదివే అవకాశం కల్పించారని వ్యాఖ్యానించిన సందర్భాన్ని ఇచ్చాపురం మరణం నేపథ్యంలో రాంబాబు గుర్తు చేసుకున్నారు.