రాష్ట్రీయం

సీఎం దార్శనికత భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 14: విద్యుత్ పొదుపులో నవ్యాంధ్ర తన ఆధిక్యతను మూడోసారి నిలబెట్టుకుంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇప్పటికే 41 లక్షలకు పైగా ఎల్‌ఈడీ వీధి దీపాలను అమర్చి ఏటా 600 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై దృష్టిపెట్టింది. ఎల్‌ఈడీ వీధి లైట్లు అమర్చడం ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతోపాటు భారీ స్థాయిలో విద్యుత్‌ను పొదుపు చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఇప్పటికే ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు అందరికంటే ముందుగా రాష్ట్రంలోని 13 వేల పంచాయతీలలో దశలవారీగా 30 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చే కార్యక్రమాన్ని చేపట్టడం విప్లవాత్మక నిర్ణయమని అభినందించిన కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు ఈ విషయంలో ఏపీని
ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్)తో కలిసి ఏపీ చేపట్టిన ఈ కార్యక్రమంపై ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఎల్‌ఈడీ లైట్లు అమర్చడం వల్ల రాబోయే పదేళ్లలో ఏపీలో ఆయా పంచాయతీలకు రూ.459 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరుతుందని, 333 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ సహాయ మంత్రి ఆర్‌కె సింగ్ వెల్లడించారు.
జాతీయ ఇంధన వనరుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్ 2017 సంవత్సరానికి గాను విద్యుత్ పొదుపులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు జాతీయ ఇంధన వనరుల పరిరక్షణ పురస్కారాలను అందజేశారు. ప్రతిష్ఠాత్మక అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖర్ రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ ఘనత చంద్రబాబు దార్శనికత, ముందుచూపు వల్లే సాధ్యమైందన్నారు.
పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో కూడా ఏపీ నుంచి పనితీరును గుర్తించిన కేంద్రం ఇప్పటివరకు 31 వేల సౌర విద్యుత్ పంపుసెట్లను మంజూరు చేసిందని, రూ.345 కోట్లు గ్రాంటుగా అందజేసిందని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో పంపుసెట్లు దక్కించుకున్న తొలిరాష్ట్రం ఏపీనే అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ఇంధన వనరుల వినియోగంలో నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అంతర్జాతీయ సాంకేతికత విషయంలో అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈఈఎస్‌ఎల్ సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. తద్వారా వినియోగదారులకు సరసమైన ధరలకే నాణ్యమైన విద్యుత్‌ను అందించవచ్చని బీఈఈ అధికారులు, ఆయా రాష్ట్రాల ఎన్డీఏ అధికారులతో కేంద్ర మంత్రి సింగ్ పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫున ఈ అవార్డు అందుకున్న ఎస్‌ఈసీఎం సీఈఓ ఎ.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కీలక రంగాల్లో 25 శాతం ఇంధన వనరులను పొదుపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఇప్పటికే దాదాపు 10 శాతం సాధించినట్లు, ఫలితంగా రూ.982 కోట్ల వరకు ఆదా అయ్యాయని, ఇవన్నీ వినియోగదారుల విద్యుత్ బిల్లులు తగ్గడానికి దోహదపడతాయని తెలిపారు. ఏపీ సీఎస్ దినేష్‌కుమార్, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ కేంద్ర ఇంధన శాఖ బీఈఈకి ధన్యవాదాలు తెలిపారు. వరసగా మూడో ఏడాది అవార్డు గెలుచుకోవడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేసినట్లు చెప్పారు. వాతావరణ మార్పులపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇంధన వనరుల పొదుపు, పరిరక్షణ కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం మూడేళ్లుగా అప్రతిహతంగా అమలు చేస్తోందన్నారు. జాతీయ అవార్డును గెలుచుకోవడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె.కళా వెంకట్రావు అధికారులను అభినందించారు.

చిత్రం..కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి ఆర్‌కే సింగ్ నుంచి జాతీయ ఇంధన వనరుల పరిరక్షణ అవార్డు అందుకుంటున్న ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి