రాష్ట్రీయం

కంటికింపుగా.. కడుపునిండుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటినిండా తెలుగుదనం. కడుపునిండా తెలుగు భోజనం... ఇదీ రెండోరోజు ప్రపంచ తెలుగు మహాసభల ముఖచిత్రం. చారిత్రాక హైదరబాద్ నగరమంతా పల్లపరుచుకున్న ఆరు వేదికల మీద అనేక కార్యక్రమాలు తెలుగుదనాన్ని వండి వడ్డించాయ. తెలంగాణ భాషకు ఓ సాధికారత ఉందని, అసలు భాషా వికాసం సాగిందే ఇక్కడంటూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొంటే.... యావత్ ప్రజానీకాన్ని కదిలించింది, చైతన్యవంతం చేసింది, కన్నీళ్లు పెట్టించింది, కనె్నర్ర చేసేలా చేసింది, బరిగీసి కొట్లాడే ధైర్యం ఇచ్చిందీ తెలంగాణ పాటేనంటూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. ఒక్క పదం వంద విస్ఫోటనాలను సృష్టించగల అణుబాంబు లాంటిదంటూనే, భాష అవసరంగా పుట్టిన సాధనమని మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు. కమ్మని తెలుగు మాటలతో కడుపునిండి బయటకు వచ్చిన అతిథులకు తినలేనంతగా వంటకాలు వడ్డించి పౌరసరఫరాల శాఖ శెహబాష్ అనిపించుకుంది. ఈ క్షణం ఇలా ఉండిపోనీ.. అనుకుంటూ అతిథులు ఆనందం వ్యక్తం చేయడం కనిపించింది.

చిత్రం..అక్షర నృత్యం