రాష్ట్రీయం

మనది.. భాషా వికాస మాగాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణలో మాట్లాడే తెలుగు భాషకు ప్రత్యేకత ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల రెండోరోజు సందర్భంగా శనివారం ఎల్బీ స్టేడియంలోని పాల్కురికి సోమన ప్రాంగణంలో ‘తెలంగాణలో తెలుగు భాషావికాసం’ పేరిట జరిగిన సాహిత్య సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బమ్మెర పోతన వేదికపై జరిగిన ప్రధాన కార్యక్రమంలో కడియం మాట్లాడుతూ తెలంగాణలో తెలుగు భాష ఆవిర్భవించడమే కాకుండా, అత్యంత ఉన్నతంగా పురోభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ తెలుగుకు గొప్ప చరిత్ర ఉందన్నారు. మాతృభాషకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తప్పని సరిగా తెలుగు భాష పాఠ్యాంశంగా ఉంటుందని ప్రకటించారు.
తెలంగాణ గడ్డ ఉద్యమాలకు పుట్టినిల్లని, నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కొనసాగించిన ఉద్యమానికి జవసత్వాలు సమకూర్చింది తెలుగు పాటేనని గుర్తు చేశారు. తెలంగాణ పాటలు సాయుధ పోరాటానికి సైరన్‌లా పనిచేశాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కవుల భూమిక కీలకమైందని అంటూ గూడ అంజయ్య, అందెశ్రీ, విమల, గద్దర్, రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, కాళోజీ, పొట్లపల్లి, వానమామలై వరదాచార్యులు, ఆచార్యగోపి తదితరులను గుర్తు చేసుకున్నారు.
తెలుగు వర్శిటీ పూర్వ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, డాక్టర్ ఎస్‌వి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు.

చిత్రం.. పుస్తక ఆవిష్కరణలో మంత్రి కడియం