రాష్ట్రీయం

హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాగుట్టు రట్టయింది. ఓ స్టార్ హోటల్‌లో సినీ, టీవీ ఆర్టిస్టులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులతో పాటు ఇద్దరు ఆర్టిస్టులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 55,000లు నగదుతోపాటు మూడు సెల్‌ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెం.1లోని హోటల్ తాజ్ డెక్కన్‌లో వ్యభిచారం నడుస్తోందని పోలీసులకు సమాచారం అందింది. ధనవంతుల పిల్లలను ఆకర్షిస్తూ ఒక రాత్రికి రూ. లక్ష, ఆపైన వసూలు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు హోటల్‌పై నిఘా పెట్టి శనివారం రాత్రి హోటల్ గదులపై దాడి చేసి సినీ నటి రిచా సక్సెనా (24), టీవీ ఆర్టిస్టు సుభ్ర ఛటర్జీ (20)లను అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ పి రాధాకిషన్ రావు తెలిపారు. ముంబయికి చెందిన మనీష్ కడాకియా (56) హైదరాబాద్‌లో నివాసముంటూ కాస్టింగ్ డైరెక్టర్, ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. వ్యభిచార నిర్వాహకుడు గుంటూరుకు చెందిన డబ్బీరా వెంకట్రావు (40)తో కలసి హైటెక్ వ్యభిచారం నిర్వహించేందుకు నిశ్చయించుకున్నారు. వీరిద్దరు కలసి ధనవంతుల బిడ్డలను ఆకర్షిస్తూ, సినీ, టీవీ ఆర్టిస్టులను సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్ హోటల్, 328 గదిలో సినీ నటితో, నెం 412 గదిలో టీవీ ఆర్టిస్టుతో వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. ఈమేరకు నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు హోటల్‌పై దాడి చేసి సినీ నటి రిచా సక్సెనా, టీవీ ఆర్టిస్టు సుభ్రా ఛటర్జీలతోపాటు ఇద్దరు నిర్వాహకులు మనీష్ కడాకియా, వెంకట్రావులను అరెస్టు చేసినట్టు డీసీపీ రాధాకిషన్ రావు తెలిపారు. వీరి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం బంజారాహిల్స్, పంజాగుట్ట పోలీసులకు అప్పగించినట్టు డీసీపీ పేర్కొన్నారు. వ్యభిచార ముఠా సభ్యుల్లో ఇద్దరు పట్టుబడగా, మరొకరు పరారీలో ఉన్నట్టు డీసీపీ తెలిపారు.